GODAVARI VACHINAPUDU PRAJALU CHEPPINA NADI CHARITRA by MALUPU BOOKS Telugu book cover

GODAVARI VACHINAPUDU PRAJALU CHEPPINA NADI CHARITRA

by MALUPU BOOKS

₹280
In stock · 13 available
PublisherMALUPU BOOKS
LanguageTelugu
ISBN9789385076138
Godavari Vachchinapudu Prajalu cheppina nadi charitra గోదావరితో తమ జీవితాలు విడదీయరాని విధంగా పెనవేసుకుపోయిన అసంఖ్యాకులైన బడుగు జీవుల దృక్కోణం నుంచి చెప్పిన ఒక గొప్ప నది కథ ఇది. ఒక భావావేశంతో చెప్పిన ఈ కథ మీ మనస్సులను పట్టివేసి, పిండివేసి, దిగ్భ్రాంతికి గురిచేసి, సిగ్గుపడేట్లు కూడా చేస్తుంది. ఆ నది, దానితో పాటు అది నడిపి నిలిపే జీవన వ్యవస్థలు విధ్వంసమవుతున్న తీరు మనకిందులో కనిపిస్తుంది. సుమారు 300 గ్రామాలు ప్రణాళికా బద్ధంగా, శాశ్వతంగా నీట మునగనున్న చిత్రమిది. ఏ రక్షణలూ లేని సామాన్య భారతీయులు కొందరు బహశా గతంలో ఎప్పుడూ లేనంతటి స్థాయిలో ముంపుకు గురై శాశ్వతంగా నిర్వాసితులు కానున్నారు. అనేకానేక అంశాలు ఇమిడి ఉన్న ఈ మొత్తం క్రమాన్ని ఉమామహేశ్వరి ఒక స్పష్టమైన దృక్పథంతో వివరించారు. ఆ వివరణలో గొప్ప పరిశోధనతో పాటు, కథాకథనంలో ఒక కొత్తదనం ఉంది. - పి. సాయినాథ్ ఎవ్రిబడీ లవ్స్ ఎ గుడ్ డ్రైట్ గ్రంథ రచయిత ఇది మనను సమూలంగా కదిలించే పుస్తకం. నది వెంట పలుమార్లు యాత్రలు చేసి, గిరిజనులతో సహా ఇతర స్థానిక సమాజాలతో కలిసి నివసించి, వారితో ఎడతెరిపి లేకుండా సంభాషించిన రచయిత్రి, వారు ఆ నదితో పాటు, దాని ప్రవాహాలూ నీటి తీతలతో పాటు ఎట్లా కలగలిసిపోయి జీవిస్తున్నారో ఇందులో చిత్రీకరించింది. ఆ ప్రజలకు నది అన్నది కేవలం 'వరదలను' తెచ్చే ఒక నిర్జీవ స్థితి కాదు. అది 'వచ్చి', 'తిరిగి వెనుకకుపోయే' ఒక స్త్రీమూర్తి. ఈ విధమైన సమన్వయపూరిత దృష్టికి, వివేకానికీ రాజ్యవ్యవస్థ, రాజకీయ వాదులు, అధికారులు, ఇంజనీర్లు, ఆర్థికవేత్తల ఆలోచనలకు చుక్కెదురు. వారంతా నదిని కొల్లగొట్టడానికి తగిన ఒక ఆర్ధిక వనరుగా, నీటిని వినియోగ వస్తువుగా, వరదలను విధ్వంసంగా, సంప్రదాయిక జీవితాన్ని వెనుకబడినదిగా, గిరిజనులూ ఇతర సమాజాలవారు కాలం చెల్లిన వారనీ వారిని (బలవంతంగానైనా) ఆధునికతలోకి తీసుకురావాలని భావిస్తుంటారు. ఏక కాలంలో ఒకవైపు విచారాన్ని, మరొక వైపు ఆనందాన్ని కలిగించే ఈ రచనను ఆధునిక వాదులు, 'అభివృద్ధి' మతస్థులలో కొందరైనా చదివి ప్రభావితులు కాగలరని ఆశించాలి.