GODAVARILOYALO VANARULAKOSAM PORATAM by JANAPRIYA Telugu book cover

GODAVARILOYALO VANARULAKOSAM PORATAM

by JANAPRIYA

₹10
In stock · 1 available
PublisherJANAPRIYA
LanguageTelugu
గోదావరి పరీవాహక ప్రాంతం~ నదులు - ఉపనదులు - అడవులు ~ దండకారణ్యంలో ప్రవహించే గోదావరి బేసిన్ మొత్తం విస్తీర్ణంలో అడవులది చాలా ప్రధాన పాత్ర. టేకు అడవుల్లో ప్రవహించే వార్ధా, పెల్గంగ-వైనగంగలు ప్రాణహితలో కలిసి గోదావరిలోకి ప్రవహిస్తాయి. పెనంగ పూర్వపు పేరు వేణు (వెదురు) గంగ. కలహండిలో పుట్టిన ఇంద్రావతి బస్తర్లో ప్రవహించి కరీంనగర్ జిల్లాలో గోదావరిలో కలుస్తుంది. బస్తర్ అంటే (బాన్స్ స్థలం) వెదుళ్ళ భూమి అని అర్ధం. గోదావరిలో ప్రవహించే మరో ఉపనది శబరికి ఉపనదులు సీలేరు, మత్స్యగడ్డ- జలచరాల పేర్లు. సీల అంటే ఎండ్రిక. విశాఖ జిల్లాలో పుట్టిన మత్స్యగడ్డ- ఎండ్రిక పర్వతంనుండి ప్రవహించే ఇతర వాగులతో కలిసి సీలేరుగా మారి శబరిలో కలుస్తుంది. ఇంద్రావతి, శబరి ఉపనదులు గిరిజనులకు ఆహారం, పరిశ్రమలకు మెత్తని కలపనిచ్చే మామిడి, పనస, అడవులగుండా ప్రవహిస్తాయి. ఇప్పపూలు, తునికాకులు, వెదురు, సారపప్పు, జిగురు, చింతపండు, తేనె, వనమూలికలవంటి అటవీ ఫలసాయం గోదావరి పరీవాహక ప్రాంతమంతా దొరుకుతుండేది. ks విశాఖ మన్యంలో ఎండ్రిక పర్వతంవలెనే, తూర్పుగోదావరి - విశాఖ సరిహద్దులోగల ధారలదుమ్మకొండనుండి సోకిలేరు, పాములేరు, కన్నేరు, ఏలేరు, బోడిపెట్టవాగు, సీతపల్లివాగువంటి వాగులు ప్రవహిస్తున్నాయి. హిమాలయ పర్వతాలలో ధవళధార పర్వతశ్రేణులు ఎటువంటివో తూర్పుకనుమలలో ఈ ఎండ్రిక, ధారల దుమ్మకొండలు అటువంటివి. ధారకొండ, ధారవాడ, ధారగూడెం, ధారలమ్మ- ఈ పేర్లన్నీ ఆ ధారల వైభవానికి సహస్రనామాలు. మన రాష్ట్రంలోగల 20 అభయారణ్యాలలో 10 ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. దండకారణ్యంలో అధిక భాగం గిరిజన ప్రాంతం. 'గలగల గోదారి నీ నడుము వొడ్డానం... ఓ అడవితల్లి'- గూడ అంజయ్య