GOLDEN ROBE AND THE CURSE OF KUNG-FU by MADHUBABU Telugu book cover

GOLDEN ROBE AND THE CURSE OF KUNG-FU

by MADHUBABU

₹120
In stock · 50 available
PublisherMADHUPRIYA PUBLICATIONS
LanguageTelugu
గోల్డెన్ రోబ్ 19 “పట్టుకో శ్రీకర్... ఈసారయినా వాడిని గట్టిగా పట్టుకో.” వారికి అడ్డుగా ప్రత్యక్షం అయిన ఒక డస్ట్బన్ మీది నుంచి ఎగిరి అవతలికి దూకుతూ బిగ్గిరిగా హెచ్చరించాడు ముఖేష్. అక్కడికి పాతిక అడుగుల దూరంలో వున్న సందు ముందు మాటువేసి వున్నాడు శ్రీకర్. రివ్వున ఇవతలికి వచ్చి, ఛట్మని డెలివర్ చేశాడు సైద్కొక్ నొకదాన్ని, యావరేజి మనిషి ఎవరయినా అయితే గుండెలు అవిసి పోయేటట్లు అరిచి అక్కడికక్కడే విరుచుకుపడిపోయి వుండేవాడు ఆ యావరేజి మనిషి కాదు బదిలీభాయ్... అటువంటి చిన్న చిన్న సైట్కెక్స్కి, ఫ్రంటల్ ఎటాక్సికీ లొంగే మనిషి అంతకన్నా కాదు. కంటికి కనిపించనంత వేగంతో కదిలిన శ్రీకర్ ఎడమ పాదాన్ని చటుక్కున పసికట్టేసి, చివ్వున వంగాడు క్రిందికి. వంగినవాడు తిరిగి నిఠారుగా నిలబడకుండానే శరవేగంతో దూరిపోయాడు శ్రీకర్ ఖాళీచేసి వచ్చిన సందులోకి..