GOMAALAKSHMI by DR.PEKETI GEETHA SHIVARAM Telugu book cover

GOMAALAKSHMI

by DR.PEKETI GEETHA SHIVARAM

₹50
In stock · 26 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
గోమాత గావోమే మా తరస్సర్వాగావోమే పితరస్తథా గావోమమాగ్రతస్స్యంతు గావోమే సంతుపృష్ఠతః" గావోమే పార్శ్వతః సంతు గహం మధ్యేవసామ్యహమ్ అని అన్నాడు శ్రీకృష్ణుడు. ప్రపంచానికే తల్లి గోవు, అందుకే గోమాత అంటాము. సర్వసంపదలనూ, సుఖాలనూ ప్రసాదించే గోవు ఒక సంపద ఆధ్యాత్మిక కార్యకలాపాలన్ని గోమాతతోనే ముడిపడి ఉన్నాయి. గోవుకు నమస్కరించిన ధర్మం. వృద్ధి అగును. గోప్రదక్షిణచేసిన భూమండల ప్రదక్షిణ చేసిన ఫలం కల్గును. గోవులను పాలించడం మనసనాతన ధర్మం. గోమాత శరీరం సమస్త దేవతల నిలయం మహాభారతంలో “అప్లైశ్వర్యమయీ లక్ష్మీ వసతే గోమయేసదా లక్ష్మీశ్చగోమయే నిత్యం పలిత్తా సర్వమంగళా, గోమయా లేపనమ్ తన్మిత్ కర్తవ్యం పాండునందన" అనిస్కాందపురాణం చెప్తోంది. పరమ పవిత్రము, సర్వమంగళమయము ఐన శ్రీలక్ష్మీదేవి గోమయంలో ఎప్పుడూ నివసిస్తుంది. కనుక గోమయంతో ఇల్లు అలికితే ధర్మార్థకామమోక్షములు సిద్ధిస్తాయి. ఆవుపాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పేడ, మూత్రము పంచగవ్యములు అన్ని ధార్మిక కార్యక్రమాలకు కావలసినవి. పవిత్రమైనవి. గోమూత్రంలో గంగవసిస్తుంది. ఎంతకాలమైనా గోమూత్రంచెడదు. గో మూత్రం విషహరం. వాతపిత్త కఫదోషాలను నివారిస్తుంది. మనస్సు, శరీరాన్ని శుద్ధి పరుస్తుందంటోంది ఆయుర్వేదశాస్త్రము, గోమూత్రం రోగనిరోధక శక్తిని పెంచాలి, వ్యాధులు రాకుండా కాపాడుతుంది. గో రక్షణ అంటే సృష్టిరక్షణే. ప్రతి ఇంటికి ఓ గోవు ప్రతి గ్రామానికీ ఓ గోశాల ఇదే మన నినాదం కావాలి గోరక్షణ, సంరక్షణే మన తక్షణ కర్తవ్యం. శాంతిమంత్రాలు : స్వప్తి ప్రజాభ్యః పరిపాల యంతాం న్యాయనే మార్గేణ మహీం మహిశాః గోబ్రహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాపి సమసా సుఖినోభవస్తు॥ పంచామృతాల్లో మొదటిది ఆవుపాలు. ఆయుర్వేదంలో చాలా వాటిని పంచామృతాలల్లోనే అనుపానంగా వాడాల్సి ఉంటుంది.