GOMATHA VAIBHAVAM-60 by DR.NITTALA GOPALA KRISHNA Telugu book cover

GOMATHA VAIBHAVAM-60

by DR.NITTALA GOPALA KRISHNA

₹60
In stock · 3 available
PublisherDR.NITTALA GOPALA KRISHNA
LanguageTelugu
సంకల్ప సిద్ధి గోవు - కామధేనువుగా మన పాలిట దైవం. చలన చిత్రనిర్మాణం, సినిమా దర్శకత్వం చేసే నేను, గోవు గురించి ఒక లఘు చిత్రం నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చిందో నాకే తెలియదు. గోమాత ప్రేరణ తప్ప మరొక్కటి కాదని చెప్పగలను. గోమాత గురించి ఎన్నో గ్రంథాలు చదివి ఎన్నో విషయాలు సేకరించాను. 30 నిమిషాల కామధేనువు లఘు చిత్రానికి లక్ష రూపాయలు వినియోగించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది ఫిలిం అవార్డును పొందగలిగాను. అదే డాక్యుమెంటరీని ఇంగ్లీషు, హిందీ, కన్నడం, తెలుగు భాషల్లో సిడీలు చేయించాను. దాంతో నా సంకల్పం గట్టిపడింది. "వందే గోమాతరం" పుస్తకాన్ని రాసేను. తిరుమల తిరుపతి దేవస్థానం వాడు మెచ్చి దానిని ప్రచురించి, మా దంపతులకు సత్కారం చేసి, వేంకటేశ్వరుని దర్శనం చేయించారు. అంతకంటే ఏమి కావాలి! జన్మ చరితార్థమైంది. గోవు గురించిన ప్రవచనాలు, గో తులాభారం, గో సీమంతం, కామధేను ననాణం వంటి ప్రక్రియలు నా అభిమతం. దాని గురించి ప్రచారం చేస్తూ గోమాత సేవా ట్రస్ట్ ప్రారంభించాను. గో తులాభారాన్ని మొదటిసారిగా భారతదేశంలో నేను వేయించడం, ఆ గోమాత నాకిచ్చిన అవకాశం. ఇంకా ఏమి చెయ్యాలి గోమాతకు? అని ఆలోచిస్తూ ఉంటే సహస్ర సూక్తులు రాయాలనిపించింది, రాయగలనా? ఎవరికీ రాని ఆలోచన నాకెందుకిచ్చిందో గోమాత, అని ప్రారంభించాను. వెయ్యి సూక్తులు రాసేను, సహస్ర నామాలు అంటారు, లలితాసహస్ర నామాలు, విష్ణుసహస్ర నామాల లాగ సహస్రం అంటే వెయ్యి అనే కాకుండా అనంతం అనే అర్థం కూడా ఉంది. అందుకే 1008గా వ్రాయడం జరిగింది. గోవు గురించి అశేష ప్రజానీకానికీ ఎవరికి ఏ విధంగా చెబితే ఎక్కుతుందోనని, సూక్తులుగా, గోమాత నామాలుగా, నాటికగా, హరికధగా, బుర్రకధగా, పాటలుగా, పద్యాలుగా, మేలుకొలుపు వ్రాయడం జరిగింది. కాదు నాచేత గోమాత రాయించింది. నా సంకల్పాన్ని సాహిత్యంగా ముందుకు నడిపించిన సాధన నరసింహాచార్య, పి.ఎస్. రామారావు (గోమాతా సేవా ట్రస్ట్- ట్రస్టీలు) సహకరించిన, సరిదిద్దిన అందరికీ నా ధన్యవాదాలు. పద్య భాగం నా చేత రాయించిన తిరుమల వెంకటస్వామి గార్కి కృతజ్ఞతలు. ఈ పుస్తకానికి "గోమాత వైభవం" అనే పేరు అన్ని విధాల అందరూ నచ్చిందన్న తర్వాతే నిర్ణయాంచాను.