
GOPALA PURVATAPINI UTTARATAPINI UPANISHATHU
₹125
In stock · 22 available
PublisherDR.ARIPIRALA VISWAM
LanguageTelugu
ముందు మాట జోపాల పూర్వతాపిని, గోపాల ఉత్తరతాపిని ఉపనిషత్తులు గోపాలుని యొక్క తత్త్వమును, స్వరూపమును చెప్పేవి మాత్రమే కాక అసలు 'గోపాల' అనే మాటకు అర్థము ఏమిటి? ఈ గోపాలుని యొక్క విశిష్టత ఏమిటి? ఆయనను ఎందుకు భవంతునిగా ఆరాధించాలి మొదలైన విషయములను సమగ్రముగా తెలియజేసేవి జోపాలుడు అంటే రేపల్లెవాడలోని నందయశోదల ఇంట పెరిగి యమునా తీరములో వాపస్త్రీలతో రాసక్రీడలాడిన వెన్నదొంగ శ్రీకృష్ణుడే గుర్తుకు వస్తాడు. కురుక్షేత్ర సంశ్రామసమయాన అర్జునునకు 'భగవద్గీత' బోధించిన శ్రీకృష్ణ భగవానుడే గుర్తుకు వస్తాడు. విష్ణుమూర్తి యొక్క అంశరూప పరమాత్మగా మనం శ్రీకృష్ణుడు అనబడే ఈ గోపాలుని భావిస్తాము. మన జ్ఞానం అంతవరకే పరిమితం. ఉపనిషత్తులలో వున్న భావార్ధమును మనం అంతవరకే గ్రహించగలము. అసలైన మూలతత్త్యం తెలుసుకుంటే తహ ఉపనిషత్తులయందు గూఢముగా దాగివున్న నిజమైన భావమును అర్థం చేసుకోలేము. అట్టి మూలతత్త్యమును తెలుసుకోవాలంటే మామూలు జ్ఞానము, మామూలు విద్య పనికిరావు. శ్రీవిద్యయే నిజమైన విద్య, విద్యలకెల్ల విద్య. అట్టి శ్రీవిద్య తెలిస్తేనే తప్ప మూలమునకు వెళ్ళలేము అనేది నిశ్చయము. 'గోపాల' అన్నపదమునే తీసుకుంటే 'గో' అంటే కాంతి, 'పాల' అంటే పాలించేవాడు. జోపాల అంటే 'కాంతిపాల' అనే అర్థం వస్తుంది. ఈ కాంతి పాల ఎవరూ అంటే పరంజ్యోతియే కాంతిపాల. ఈ పరంజ్యోతి యొక్క తత్త్యమేమిటి? స్వరూపమేమిటి? స్వభావమేమిటి? ఈ పరంజ్యోతిని 'గోపాల' అని ఎందుకు అనవలసి వచ్చింది? మొదలైన విషయములన్నీ గోపాల పూర్వతాపిని ఉపనిషత్తు ప్రస్తావిస్తుంది. ఒక సందేహం మనకు కలిగితే దానిని తీర్చుకోవడానికి మనం గురువు వద్దకో, ఉపాధ్యాయుని వద్దకో లేదా ఒక జ్ఞాని వద్దకో వెళ్ళి వారిని అడిగి సందేహ నివృత్తి చేసుకుంటాము. ఉపనిషత్తులలో కూడా మనకు ఇదే విధం కన్పిస్తుంది. బ్రహ్మవేత్త లేదా బ్రహ్మజ్ఞాని లేదా బ్రహ్మజ్ఞుడు అయిన మహాత్ముని వద్దకు కొందరు మునులు లేదా విజ్ఞులు వెళ్ళి వినయముతో అడిగిన ప్రశ్నల కారణముగా ఆయా తత్త్యములు ఆయా స్వరూపములకు సంబంధించిన విషయములు ఉపనిషత్తుల రూపమున సకల మానవాళికి అందుబాటులోకి వచ్చినట్లు ఉపనిషత్తులు చదివేవారికి తెలుస్తుంది. ఈ ఉపనిషత్తుల మూలముననే కొన్ని మంత్రములు కూడా బహిర్గతమై జన బాహుళ్యానికి తెలుస్తున్నాయి.