
GOPI GOPIKA GOMATHI
₹200
In stock · 6 available
PublisherD.SUNDARA RAO
LanguageTelugu
చిన్న ఊరు తామరాపల్లి, నరసన్నపేటకు అయిదు కిలోమీటర్ల దూరం. ఇచ్చట చిన్నాపెద్దా రైతు కుటుంబాలు ఎక్కువ. వ్యవసాయ కూలీలు ఎక్కువే. ఇక్కడ ఉన్నవి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, గ్రామ పంచాయితి మాత్రమే. ఉన్నత పాఠశాల, కళాశాల విద్యలకు నరసన్నపేటయే ఆధారం. త్రాగుటకు, వంటకు ఇంటింటా మంచినీటి బావులు. రెండెకరాల సాగుభూమితో వెంకటయ్యనాయుడు సన్నకారు రైతు. భార్య పారమ్మ. ఈ దంపతులకు కూతురు పద్మజ, కొడుకు గోపీకృష్ణ సంతానం, రాఘవయ్య నాయుడు కూడా రెండెకరాల సాగువ్యవసాయదారుడు. ఇతని భార్య సీతమ్మ. వీరికి సరస్వతి, గోపిక కూతుళ్లు, చంద్రయ్య కొడుకు. రాఘవయ్య అక్క పారమ్మ. ప్రక్కప్రక్కనే ఈ రెండు కుటుంబాల ఇళ్లు. గడపకు ఒక ప్రక్కగా అరుగు మీద వెంకటయ్య కూర్చొని, చుట్టపొగ పీల్చుచుండెను. రాఘవయ్య వచ్చి ప్రక్కనే సర్దుకొనెను. అతన్ని చూచి," ఏం రాఘవా! ఏమైనా చెప్పాలనా, అడగాలనా వచ్చావు" అని అతనివైపు చూచెను. “చెప్తా బావా. ఏదీ ముందు ఆ అగ్గిపుల్ల ఇవ్వు. చుట్ట అంటించుకొంటాను". జేబులోంచి, అగ్గిపెట్టెతీసి వెంకటయ్య అందించెను. పుల్ల రంగదీసి అతను చుట్ట ముట్టించుకొనెను. “ఆ... ఇప్పుడు చెప్పు రాఘవా”. "రేపు పొలము దున్నాలనుకొంటున్నాను”. "అవును కదా. సమయము వచ్చింది. నేనూ దున్నాలనే ఆలోచిస్తున్నాను". "బయట ఎండలు మండుచున్నవి. బయటికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది కదా బావా”.