GORRELA MEKALA VYADHULU HOMEO CHIKISTA by DANTU SATYANARAYANA Telugu book cover

GORRELA MEKALA VYADHULU HOMEO CHIKISTA

by DANTU SATYANARAYANA

₹20
In stock · 22 available
PublisherDANTU SATYANARAYANA
LanguageTelugu
ఉపోద్ఘాతము భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ప్రజలు 80% పల్లెల్లోనే జీవిస్తూ వ్యవసాయం వ్యసాయ అనుబంధ పరిశ్రమల మీద ఆధారపడుతున్నారు. గొర్రెలు, మేకల పెంపకం చిరకాలం నుండి గొల్లలు చెపట్టుతున్నారు. కాని కాలక్రమంలో అన్ని వర్గాలవారు ఈ వృత్తిని చేప్పట్టి ఆర్ధికంగా లాభం పొందుతూ తమ కుటుంబాలను పోషించుకోంటున్నారు. గొర్రెలు, మేకల ధరలు ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్నాయి. గొర్రెల్లో వ్యాధులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటువ్యాధుల వల్ల చాలా గొర్రెలు చనిపోతున్నాయి. వ్యాధులపై చాలా మంది గొర్రెల కాపరులకు ఎలాంటి అవగాహన లేదు. వ్యాధులు వస్తే మందులకు ఎక్కువ ఖర్చు చేస్తు ఆర్థికంగా నష్టపోతూ, గొర్రెలను కూడా కోలుపోతున్నారు. అల్లోపతి పద్దతిలో వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రతి మారుమూల పల్లెలో వైద్యులు సరిగ్గా అందుబాటులో ఉండని కారణంగా వైద్యం అందక ఆర్ధికంగా నష్టపోతున్నారు. వీరికి వ్యాధులు వాటి లక్షణాల మీద కొంత అవగాహన కల్పించి తక్కువ ఖర్చుతో ప్రధమ చికిత్స చేసుకొని కొన్ని గొర్రెలనైనా కాపాడుకుంటారనే ఉద్దేశంతో నా పశువైద్య అనుభవంతో ఈ చిన్న పుస్తకాన్ని వెలువరిస్తున్నాను. ఈ హోమియోపతి వైద్య విధానం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. నిరపాయకరమైనది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనివి మరియు తెలికగా ప్రధమ చికిత్స చేసుకొనే వీలున్న ఈ వైద్య విధానాన్ని అందరికి అందుబాటులోకి తేవాలని నా ఉద్దేశం. ఈ మందులు గొర్రెలకు అరకు రూపంలో వాడటం చాలా తెలిక. ఇవి సారా వాసన ఉండటం వల్ల సారా మందుగా గొల్లలందరికి పరిచితమే. మందలు మందలుగా ఉన్న గొర్రెలకు ఒకే సారి మందు త్రాగించటానికి వీలుగా కావలసినంత మందులో నీరు కలిపి సిరంజీలో నోట్లో వేయాలి. మందులు 30, 60, 120, 450 సిసిల్లో దొరుకుతుంది. దీన్ని డాల్యూషన్ ప్రతి మందుకు ప్రక్కనే దాని ఫొటేన్సీ నెంబరు 6, 30,200, అని అంకెలు ఉంటాయి. దాని ప్రకారం మందు తెచ్చుకొని వాడాలి. గొర్రెలకు, మేకలకు ప్రత్యేకంగా మందులంటూ ఏమి లేవు.