
GOURAVAPRADAMAINA ABHIVRUDDHI
₹45
In stock · 1 available
PublisherNATIONAL BOOK TRUST INDIA
LanguageTelugu
ముందుమాట 1947లో ఇండియా బ్రిటిష్ ఏలుబడినుంచి విముక్తమై స్వాతంత్య్రం సాంపాదించిన దగ్గర్నుంచి ప్రజాస్వామ్యం, ఆర్థికాభివృద్ధి మధ్య కొనసాగిన అంతస్సంబంధాల వల్ల ఎదురైన సవాళ్ల గురించి ఈ గ్రంథం చర్చిస్తుంది. మతం, భాష, జాతులు మొదలైన అనేకానేక వైవిధ్యాలతో కూడిన అత్యంత పేద దేశమైన భారత్ క్రమంగా పరిణత ప్రజాస్వామ్య దేశంగా పరిణామం చెందడం గణనీయమైన విజయం. రాజకీయ చరిత్రలో ఇలాంటిది మరెక్కడా కనిపించదు. కానీ ఈ విజయం ఎంత మహత్తరమైనదైనప్పటికీ విస్తృతమైన పేదరికం, నిరక్షరాస్యత, మతపరమైన, సామాజికపరమైన, లింగపరమైన వివక్ష కొనసాగడం క్షమించరాని వైఫల్యమే. ప్రభుత్వ ప్రణాళికా విధానంలో లోపాలు, మార్కెట్ వైఫల్యం వంటివి ఈ సమస్యలకు కారణం అని వాదించేవారున్నప్పటికీ వీటికి అంతస్సంబంధం ఉంది. సాంప్రదాయిక వామపక్షాలకు గానీ, సాంప్రదాయిక మితవాద పక్షాలకు గానీ ఈ ప్రశ్నలకు సమగ్రమైన, సంతృప్తికరమైన సమాధానం చెప్పే శక్తి కనిపించడం లేదు. ఈ పక్షాలకు భవిష్యత్ భారత అభివృద్ధిపై సమ్యక్ దృక్పథం కూడా లేదు. విస్తృతంగా ఉన్న పేదరికం, నిరక్షరాస్యతను సత్వరం నిర్మూలిచండానికీ అదే సమయంలో కుల, మత, లింగపరమైన పక్షపాతంతో కూడిన అవరోధాలను తొలగించలేకపోతే ఇలాంటి దృక్పథం ఉన్నప్పటికీ అది నిష్ప్రయోజనకరమైందే. ప్రపంచీకరణ నేపథ్యంలో మార్కెట్కు అనుకూలమైన అధిక అభివృద్ధి గానీ, కేంద్రీకృత ప్రణాళికా విధానంతో నిరంకుశాధికారం కలిగిన రాజ్య వ్యవస్థ గానీ ఈ సమస్యలను పరిష్కరించగలుగుతాయని నమ్మబలకడాన్ని కూడా విశ్వసించలేం.