GOUTHAMI GADHALU by INDRAGANTI HANUMACHHASTRI Telugu book cover

GOUTHAMI GADHALU

by INDRAGANTI HANUMACHHASTRI

₹150
In stock · 4 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
ఒక్క మాట నాకు ఆత్మకథలు వ్రాసుకోదగినంత అవసరంగాని, అధిక్యం గాని లేవని స్పష్టంగా తెలుసు. కాని - ఈ రచనలో నాకొక లక్ష్యం ఉంది. సుమారు ఏభై ఏళ్ళ కిందట నా ఉదీయమానవేళల్లో ఈ దేశపు అంతరంగాలు, ఆవేశాలు, ఆకాంక్షలు ఎట్లా ఉండేవి? ఎట్లా నడిచాయి? వాటి వెనక రకరకాల ఉద్యమ ప్రభావాలు ఎట్లా పనిచేశాయి? ఆనాటి శైష్యోపాధ్యాయిక తీరు ఎట్లా ఉండేది? ఈనాడు కథావశిష్టులైన పెద్దలు ఏ దిశగా నడిచారు? ఎలా ఆలోచించేవారు? అనే బొమ్మ ఈ తరం వారికి చూపడమే నా ముఖ్యోద్దేశం. దానికి వట్టి అనుభవాలు, జ్ఞాపకాలు, రికార్డు చెయ్యడం కాకుండా చమత్కారం, ఛలోక్తులు జోడించి కథనాన్ని రుచిమంతంగా చెయ్యడానికి ప్రయత్నించాను. అలవోకగా ప్రారంభించిన దీనికి, నేననుకున్నదానికంటె ఇబ్బడిగా ముబ్బడిగా యువతరం ప్రతిస్పందించి అభిమానం వర్షించడం, ఆసక్తితో చేరువకావడం, ఆశ్చర్యం ఆనందం కలిగించాయి! నా అంతరంగంలో సుప్తంగా గుప్తంగా ఉన్న ఈ అనుభవ గాథల్ని- హుషారుగా పైకి లాగి మరుపురాని ముచ్చట్లుగా ఒకరూ, గౌతమీ గాథలుగా మరొకరూ అచ్చువేసి విడిచిపెట్టిన శ్రీ ఏ.బి.కె. ప్రసాద్, శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మలకు నా సన్నేహ కృతజ్ఞతలు!