
GOUTHAMIPUTRA SATHAKARNI
by DR.EMANI SIVANAGIREDDY STHAPATI
₹99
In stock · 7 available
PublisherS.R PUBLICATIONS
LanguageTelugu
శాతవాహనులు ఛిముకుడనే రాజు తెలుగునేలైన తెలంగాణాలో శాతవాహన రాజ్యాన్ని స్థాపించి శాతవాహన వంశ మూలపురుషుడైనాడు. తరువాత వచ్చిన రాజులు ఎగువనున్న మహారాష్ట్ర, మధ్య భారత దిగువ భాగం, విదర్భ ప్రాంతాలను జయించి రాజ్యాన్ని విస్తరించిన శాతవాహనులు క్రీ.శ. 1వ శతాబ్దిలో తీరాంధ్ర, కర్ణాటక ప్రాంతాలను కూడా చేజిక్కించుకొని, ధాన్యకటకాన్ని (ధరణికోట) రాజధానిగా పాలించారని ఇటీవలి పురావస్తు పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. శాతవాహన రాజుల్లో మూడోవాడైన శాతకర్ణి కాలం నుండి అతని పేరు మీదే శాతకర్ణి కులంగా పిలువబడింది. తరువాతి రాజుల పేర్ల చివర కూడా శాతకర్ణి పదం చేర్చబడింది. వాసిష్టీపుత్ర పులుమావి 19వ పాలనా సం॥లో వేయించిన శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణిని శాతవాహన కులయస పటిఠాపనకరస అని పేర్కొనబడింది. గౌతమిపుత్ర శాతకర్ణి, శాతవాహన కులానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టినవాడని అర్థం. మలిశాతవాహన రాజులైన స్కంధశాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, విజయశాతకర్ణి, కుంభశాతకర్ణి, కర్ణ శాతకర్ణి మరియు శకశాతకర్ణి వారి వ్యక్తిగత పేర్ల చివర శాతకర్ణి పదాన్ని వంశం పేరుగా వాడుకొన్నారు. తరువాత కాలపు శాతవాహనేతర రాజవంశాలు కూడా, శాతకర్ణి వంశాన్ని వాడుకొన్నట్లు కదంబ రాజైన శాంతివర్మ తలగుండ శాసనం (శాతకర్ణా ్యధిభిచ్చ) వల్ల తెలుస్తుంది. వారు కొన్ని సందర్భాల్లో సాతవాహనగానూ, మరికొన్ని సందర్భాల్లో శాతవాహనగానూ పేర్కొనబడినా, బాణుని హర్షచరితం, రాజశేఖరుని కావ్యమీమాంస, సోమదేవుని కథాసరిత్సాగరం, హేమచంద్రుని అభిదానచింతామణి, అనేకార్థకోశంలలోనూ, ఇంకా ఆర్యమంజుశ్రీ మూలకల్పంలోనూ సాతవాహన శబ్దాన్నే వాడిన విషయాన్ని గమనించాలి. వాత్సాయనుడు తన కామశాస్త్రంలో శాతవాహన, (కర్తార్యకుంతలః శాతకర్ణి: శాతవాహనో, మహాదేవీం మలయవతిం) శబ్దాన్నే వాడాడు. క్రీ.శ. 12వ శతాబ్దికి చెందిన సోమదేవుడు, తన కథాసరిత్సాగరంలోని వివరాల ప్రకారం, సంతానం లేని దీపకర్ణ అనే రాజు వేటకు వెళ్ళినపుడు, సాత అనే యక్షుడు, సింహం రూపంలో ఒక బాలుణ్ణి తనపై ఎక్కించుకొని అడవిలో తిప్పుతుండగా చూశాడు.