
GOWRI (NAVALA)
₹99
In stock · 48 available
PublisherH.S.M.KAMESWARA RAO
LanguageTelugu
నా మాట చాలా కాలంగా ప్రసిద్ధ హిందీ, పంజాబీ రచయిత్రి శ్రీమతి అజీత్ కౌర్ గారి నవల 'గౌరి' హిందీ నుండి తెలుగులోనికి అనువాదం చేసి సహృదయ తెలుగు పాఠకులకు అందివ్వాలనే సంకల్పం. కానీ కొన్ని ఆర్థిక, వ్యక్తిగత కారణాల వల్ల ప్రచురించడంలో చాలా జాప్యం జరిగిపోయింది. అయినా ప్రచురించాలనే దృఢ నిశ్చయంతో ప్రయత్నం చేసి కృతకృత్యుడనయ్యాను. 'గౌరి' నవలలో ప్రముఖ పాత్ర 'గౌరి'. రచయిత్రి ఈ పాత్రను మలచిన తీరు అత్యంత సహజమే కాకుండా అద్భుతం. నాటికీ, నేటికి కూడా ఈ నవలలోని కథావస్తువు సమాజాన్ని అద్దంపట్టి చూపిస్తుంది. అనువాదం చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో భావోద్వేగం పొందిన విషయము వాస్తవం. అందుకే మూల రచన యొక్క విశిష్టతకు భంగం వాటిల్లకుండా అనువాదం చేయగలిగేననే తృప్తి యథార్థం. ఈ నవల వ్రాత ప్రతిని సలక్షణంగా తయారు చేయడానికి సహకరించిన నా విద్యార్థినులు లలిత, జె. రాజ్యలక్ష్మిలకు ధన్య వాదాలు. అనువాదం చేయడానికి అనుమతి ప్రసాదించిన అజీత్ కౌర్ గారికి సవినయంగా ప్రణామములు. పుస్తకాన్ని చక్కగా డి.టి.పి. చేసిన శ్రీ ఎ. భాస్కర్, అందంగా ముద్రించిన మిత్రులు శ్రీ కె. బుచ్చిరాజు, తిరుమల ఆఫ్సెట్ ప్రింటర్స్ వారికి కృతజ్ఞతలు. సహృదయ పాఠకులు ఈ ప్రయత్నాన్ని తప్పక ప్రోత్సహిస్తారని ఆశిస్తాను.