
GRAHANTARA JEEVULU UNNARU
₹50
In stock · 16 available
PublisherANANTULA SATYANARAYANA
LanguageTelugu
సత్యమేవ జయతే! అప్పటివరకూ ప్రపంచానికి తెలియని ఓ కొత్త విషయాన్ని చెప్పాలనుకునే వ్యక్తికి మొదట ధైర్యం కావాలి. ఐతే, అదొక్కటే సరిపోదు. ఎందుకంటే, తాను చెప్పేది సరైందే అని ఋజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలుండాలి. అలా లేని పక్షంలో విమర్శకులు సంధించే పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చేతులెత్తాయాల్సి వుంటుంది. అందుకే అలాంటి సందేహాలకు అవకాశం లేకుండా పూర్తి ఆధారాల్ని సాధించా.. ఐనా, వెంటనే నా పరిశోధనా ఫలితాల గురించి వెల్లడించలేదు. తగిన ఆర్థిక తోడ్పాటు కోసం కొందరు స్నేహితుల్ని సంప్రదించా. వారితో నా పరిశోధనకు సంబంధించిన కొన్ని విషయాల్ని చర్చించా. అలా నాతో ఎంతో కొంత సుదీర్ఘంగా చర్చించినవారిలో టివీ-9 సి.ఇ.ఓ. రవిప్రకాష్ కూడా ఒకరు. గ్రహాంతర జీవుల పరిశోధనకు సంబంధించిన చర్చల సందర్భంగా ఓసారి రవి ప్రకాష్ ఇలా ప్రశ్నించారు. "నీకు నా కన్నా ఐ.క్యూ, ఎక్కువుంది. ఐనా, ఎందుకిలా అయ్యావు?" అప్పటి నా అనారోగ్య పరిస్థితి ఆర్థిక దుస్థితిని చూసి ఆయన అలా అన్నారు. అందుకు నేను మౌనంగానే సమాధానమిచ్చా నా మౌనం వెనుక ఈ దేశ చరిత్ర ఉంది; ఎంతటి మేధావినైనా కులం దృష్టితోనే చూసే కుసంస్కృతి నుంచి మన దేశాన్ని నడిపే (ఆర్థిక వనరులపై పెత్తనమున్న) పెద్దల్లో ఎక్కువ భాగం ఇంకా బయటపడని దుస్థితి ఉంది.