GRAHANTARA JEEVULU UNNARU - 2 by ANANTULA SATYANARAYANA Telugu book cover

GRAHANTARA JEEVULU UNNARU - 2

by ANANTULA SATYANARAYANA

₹50
In stock · 19 available
PublisherANANTULA SATYANARAYANA
LanguageTelugu
ముందుమాట ఈ ప్రపంచం (విశ్వం) ఒక వాస్తవం. ఐతే, ఈ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటుంది. సహజంగా జరిగే మార్పుల్ని అర్థం చేసుకొని, వాటిని మన సమాజ అభివృద్ధికి ఉపయోగించినప్పుడు అదే సైన్స్ అవుతుంది. నిజమే... సైన్స్ను కొందరు చెడుకు కూడా ఉపయోగిస్తారు. అటువంటివారిపట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతి గమన నియమాల్ని కచ్చితంగా స్పష్టం చేసేదే సైన్స్. ఐతే, మన భూగోళంమీద ఇప్పటివరకూ అభివృద్ధి చేసిన సైన్స్ కొన్ని సమస్యలకు స్పష్టమైన సమాధానాలు చెప్పలేకపోతోంది. అటువంటిదే గ్రహాంతర జీవులు ఉన్నారా? లేరా? అన్న ప్రశ్న. మన టెలిస్కోపులకు కనిపిస్తున్న విశ్వంలో... 300 కోట్ల కోట్ల కోట్ల నక్షత్రాల వరకూ అంచనా ఉంది. అన్నికోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు కూడా ఒక నక్షత్రం మాత్రమే. సూర్యుడి చుట్టూ భూమి ఇంకా ఇతర గ్రహాలున్నట్టే మిగతా నక్షత్రాల్లోనూ చాలా వాటికి (కొన్నింటికి మినహాయిస్తే) గ్రహ వ్యవస్థలుండే అవకాశముందనే అంచనా ఉంది. అంతే కాదు... ఇప్పటికే మనకు సమీపంలోని కొన్ని నక్షత్రాల చుట్టూ గ్రహాల్ని గుర్తించారు. అంటే ఈ విశ్వంలో జీవ పరిణామానికి, మానవులవంటి ఉన్నత జీవుల ఆవిర్భావానికి కోటానుకోట్ల గ్రహాలపై అవకాశముందనేది శాస్త్రవేత్తల అంచనా. ఈ మహావిశ్వంలో మనకన్నా తెలివైన జీవులు కూడా ఉండే అవకాశముందని తమకున్న భౌతిక, గణిత, జీవశాస్త్ర పరిజ్ఞానంలో వారు అంచనా వేస్తున్నారు. అవన్నీ లాజికల్గా వివరించి- విశ్లేషించి అందరికీ అర్థమయ్యేట్టు చెప్పడం కాస్త కష్టమైందే. దానికి తోడు మన శాస్త్రవేత్తలకున్న పరికరాలకు ఇతర నక్షత్ర గ్రహాల గురించి పరిశోధనలు జరిపేందుకు పరిమితులున్నాయి. ఇక ఇతర నక్షత్ర గ్రహాలవైపు వెళ్లేందుకు అవసరమైన వాహనాల్ని రూపొందించడం సమీప భవిష్యత్లో సాధ్యం కాదు కూడా.... ఈ పరిమితుల మధ్య మన శాస్త్రవేత్తలకు గ్రహాంతర జీవుల గురించిన అవగాహన అంచనాలకే పరిమితం...