
GRAMANAMALU
₹200
In stock · 5 available
PublisherVADRANGI KONDALARAO
LanguageTelugu
పల్లెలే మల్లెలై....బస్తీలే బంతిపూలై... నగరాలే.... నవపారిజాతాలై పరిమళించాలని నా అభిలాష.... నిజానికి ఇవన్నీ జాతికి పట్టుకొమ్మలు... సంస్కృతికి నజరానాలు. సంప్రదాయాలకు దిక్సూచిగా విలుస్తాయి. ప్రాచీన, నవీన నాగరికతలకు వారధిగా ఉంటున్నాయి. ఓ దేశ ప్రగతి లేదా రాష్ట్ర ప్రగతి వీటిపై ఆధారపడి ఉంటాయనేది అక్షగ సత్యం. ప్రతి వ్యక్తి ఏదో ఓ గ్రామంలో పుట్టక తప్పదు. పెరగక తప్పదు. తన చుట్టూ ఉన్నవారితో బంధాలు, అనుబంధాలు తప్పవు. కొన్ని సందర్భాల్లో విభేదాలు తప్పదు. అంచేత ఊరు అనేది ప్రకృతి అందాలను మన కళ్ల ముందుంచే ఓ రమణీమ దృశ్యం. బాలసారె నుంచి అంతిమ శ్వాస విడిచే వరకూ గ్రామంతో అనుబంధం కొనసాగుతుంది. కన్నతల్లి లాంటి ఊరిలో గల బాంధవ్యాలు మరపురానివి. ఉద్యోగ, ఉపాధి కోసం దూరప్రాంతాలకు, చివరకు విదేశాల్లో స్థిరపడిన వారు పండగలకు శుభకార్యాలకు, అశుభకార్యాలకు సొంత ఊరు వస్తున్న వైనం తెలిసిందే. సొంత ఊరిలో సంబంధం ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలుగా ఉంటాయి. జన్మనిచ్చిన అమ్మ, నడిపించిన నాన్న, పుట్టిన ఊరు తిరిగిన ప్రదేశాలు జీవితంలో ఎన్నో మధుర స్మృతులుగా ఉంటాయి.