
GRAMEENA PRAJAVANI SUNKARA SATYANARANA
by DR.YARLAGADDA LAKSHMI PRASAD
₹50
In stock · 12 available
PublisherRAITHU NESTAM PUBLICATIONS
LanguageTelugu
మనవి 1981 డిసెంబరు నెలలో కృష్ణాజిల్లా స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి కాంగ్రెసేతర ప్రతిపక్షాల అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి, నేను ఎన్నికగుటకు, రాష్ట్రంలోని కాంగ్రెసేతర ప్రతిపక్షాలవారు, కృష్ణాజిల్లాలోని పంచాయితీ సర్పంచ్లు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎందరో ఎనలేని కృషిచేసారు. వీరందరూ కలసి నామీద ఉంచిన విశ్వాసానికి, నా పట్ల చూపించిన ఆదరానికి నేను చిరకృతజ్ఞుడను. ఈ లోగా రాష్ట్రంలో వచ్చిన రాజకీయ పరిణామల ఫలితంగా నేను శాసన మండలి సభ్యత్వాన్ని వదలి కృష్ణాజిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని చేపట్టవలసి వచ్చింది. నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్న 16 మాసాలలో ప్రజలు నాపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగానే ప్రవర్తించానని, వివిధ ప్రజాసమస్యలను శాసన మండలి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావటానికి నా శయశక్తులా కృషిచేశాననే భావిస్తున్నాను. నేను శాసనమండలిలో చేసిన ప్రసంగాలను ఒక పుస్తకరూపంలో ప్రజలకందించుదామని చేసిన ప్రయత్నమే ఈ "గ్రామీణ ప్రజావాణి", నా శాసన మండలి ప్రసంగాలను ఏర్చి, కూర్చి చక్కగా ఎడిట్ చేసిన మా లక్ష్మీప్రసాదు, చక్కగా ముద్రించిన మా మండవ రత్తయ్య (కమలేంద్ర (ప్రెస్) గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను శాసనమండలిలో ఉండగా నన్నందులో అభిమానించి, ఆదరించిన మా శాసనమండలి చైర్మన్ సయ్యద్ ముఖాసిర్ షా గారు ఈ "గ్రామీణ ప్రజావాణి"కి ముందుమాట వ్రాసారు. వారికి నేను చిరకృతజ్ఞుడను.