GREESHMA BHOOMI KATHALU by DR.VEMPALLI GANGADHAR Telugu book cover

GREESHMA BHOOMI KATHALU

by DR.VEMPALLI GANGADHAR

₹65
In stock · 17 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
గ్రీష్మ భూమి కథలు డా॥ వేంపల్లి గంగాధర్ కలకాలం నిలిచే కథలు ఇవి. నిజాయితీ, నిబద్ధత ఇరుసులుగా, వాస్తవికతను ప్రతిబింబిస్తూ కడప జిల్లా మాండలికంలో పరిమళించిన కథలు. మనుషులకు రకరకాల కలలు, కథలు ఉన్నట్లే, దేశ ప్రాంతాలకు, ప్రదేశాలకు ప్రత్యేకమైన నిర్దేశాలు, నిరాకరించ వీలులేని నిరతిశయాలు ఉంటాయి. ఆ ప్రాంతం భాష, ఆ వాతావరణాల కలయికలో రాసినప్పుడే అవి బాగా రాణిస్తాయి. ఈ కథలు సాఫీగా చదువుకుపోవడానికి ప్రాంతీయ పడికట్టులు అంతగా అడ్డు తగలవు. ఇందులోని 13 కథలలోనూ కడప జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన మనుషులు, వాతావరణం, రాజకీయాలకు ఇంకా అతకని మనస్తత్త్వాలు కనిపిస్తాయి. కథలన్నీ వాస్తవికతను, మానసిక దౌర్భల్యాల నుంచి బయట పడీ పడకుండా ఉండే మనుషులను, దేశాభ్యుదయానికి నిజంగా జరగవలసిన మార్పుచేర్పులను సూచిస్తాయి. సకారణంగా, సోదాహరణలతో చెబుతాయి. సహృదయులందరూ ఆదరించి ఆచరణ సూత్రాలు తయారు చేసుకోవలసిన కథల సంపుటం ఇది. రచయిత నిజాయితీ, నిబద్ధత అభినందనీయం. - శ్రీ విరించి * విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్