GRUHONMUKHAM by SRI SRI RAVI SHANKAR Telugu book cover

GRUHONMUKHAM

by SRI SRI RAVI SHANKAR

₹20
In stock · 1 available
PublisherSRI SRI PUBLICATIONS TRUST,INDIA
LanguageTelugu
గృహోన్ముఖం మనందరం ఇక్కడి కెందుకొచ్చాము ? ఏదో విందామని సరియైందేదో శ్రద్ధగా శ్రవణం చేద్దామని మనం ఇక్కడ సమావేశమైనాము. అవునా ? దీన్నే ఉపనిషద్ అని అంటారు. జ్ఞాన సమావేశాలను జరుపుకునే ఒక పురాతన పద్ధతి ఇది. ఉపనిషద్ అంటే దగ్గరగా కూర్చోవడమని అర్థం - శారీరకంగానే కాదు, ఆత్మత : మానసికంగా సమీపాన కూర్చోవడమని. ఏం జరుగుతున్నదో అక్కడికి వెళ్ళి చూడనివ్వండి. అనే పైపై కుతూహలం ఉపనిషద్ అనిపించుకోదు. కాలయాపన కొరకు ఊరకనే ఒక ఎగ్జిబిషన్ చూద్దామని గాని, ఏదో ఒక ప్రసంగం విందామని గాని వెళ్ళినప్పుడు సగం సమయం అక్కడ ఉన్నా కాని మనస్సు మరో చోట ఉంటుంది. ఇది ఉపనిషద్ కాదు. జ్ఞానాన్ని, సత్యాన్ని, నిజతత్వాన్ని తెలుసుకోవాలనే తీవ్రవాంఛ, తృష్ణ ఉండి అందుకు ఇష్టపడినప్పుడే అది ఉపనిషత్ అవుతుంది. అదోక యదార్థమైన విచారణ - దీంతో ఉపనిషత్ ఆరంభమవుతుంది. అందువల్ల ఈ రోజు మీరు ఏ అంశాన్ని చర్చించ గోరుతున్నారు ? మీరు తెలుసుకోదలచింది ఏమిటి ? ఉపనిషత్ ఒక ప్రశ్నతో ఆరంభమౌతుంది. ఎందుకంటే జ్ఞానం