
GUERILLA YUDDHAM - MARXISM
₹60
In stock · 11 available
PublisherDIKSUCHI PRACHURANALU
LanguageTelugu
ప్రకాశకుల ముందుమాట చరిత్రలో అన్ని దశల్లోనూ అన్ని దేశాల్లోనూ వందలాది సంవత్సరాల క్రితం నుండి జరిగిన యుద్ధాలన్నింటిలో గెరిల్లా యుద్ధతంత్రం ఏదో మేరకు అమలు జరిగింది. శక్తివంతమైన రాజ్యసైన్యాన్ని ఎదుర్కోవడానికి బలహీనమైన దేశ సైన్యాలు, తక్కువ స్థాయిలో సాయుధులైన ప్రజలు ఈ యుద్ధతంత్రాన్ని ప్రయోగించారు. గతంలో ప్రజలను దాస్యానికి గురిచేసిన సామ్రాజ్యవాద, వలసవాద శక్తులన్నింటినీ ప్రజలు తమ తమ దేశాల్లో గెరిల్లా యుద్ధం ద్వారా వీరోచితంగా ప్రతిఘటించారు. ఉదాహరణకు, మన దేశంలోనే బ్రిటీష్ సామ్రాజ్యవాద వలనశక్తిని వీరోచితంగా ఎదుర్కొని పోరాడిన అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా, సిద్ధు, కానూలు గెరిల్లా యుద్ధతంత్రాన్ని ఉపయోగించారు. చరిత్రలో అనేక సందర్భాల్లో అన్ని వర్గాలు తమ తమ ప్రత్యర్థి శక్తిపై గెరిల్లా పోరాటాలను నిర్వహించడమో, పాల్గొనడమో జరిగింది. కాలం చెల్లిన భూస్వామ్యాన్ని నాశనం చేయడం కోసం కార్మికుల, రైతాంగం మద్దతుతో బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు నడిపిన జాతీయ బూర్జువా వర్గం కూడా గెరిల్లా యుద్ధతంత్రాన్ని ఉపయోగించింది. దీనికి ఉదాహరణగా 1776 నాటి అమెరికా బూర్జువా విప్లవాన్ని చెప్పుకోవచ్చు. కార్మికవర్గం తన చారిత్రక లక్ష్యాలను సాధించుకోవటానికి సాయుధ పోరాట ఎత్తుగడలను అవలంబించాలని చరిత్రలో తొలిసారిగా చెప్పిన వారు మార్క్స్ ఎంగెల్స్ు. "ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్న సామాజిక పరిస్థితులన్నింటినీ బలప్రయోగంతో కూలదోయటం ద్వారానే కమ్యూనిస్టులు అంతిమ లక్ష్యాలను సాధించుకోగలర"ని 1847వ సంవత్సరంలో మార్క్స్, ఏంగెల్స్లు 'కమ్యూనిస్టు ప్రణాళిక'లో ప్రకటించారు. యూరప్ 19వ శతాబ్దంలో ఫ్యూడల్ కులీన వర్గాల నుండి రాజకీయాధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అభివృద్ధి చెందిన పారిశ్రామిక బూర్జువా వర్గాలు బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలను నడిపాయి. వాటికి మద్దతుగా జరిగిన కార్మికవర్గ పోరాటాల క్రమంలో శ్రామికవర్గ విప్లవ సాయుధ పోరాట ఎత్తుగడలపై మార్క్సిస్టు సూత్రీకరణలు రూపొందటం ఆరంభమయ్యింది. మార్క్స్, ఎంగెల్ల్స్కు గెరిల్లా యుద్ధతంత్రాన్ని ప్రజా పోరాట రూపంగా పేర్కొన్నారు. 20వ శతాబ్దం నుండి మార్క్సిస్టు సిద్ధాంతం, మార్క్సిస్టు నిర్మాణ పద్ధతులపై అభివృద్ధి చెందిన కమ్యూనిస్టు ఉద్యమం గెరిల్లా యుద్ధతంత్రంతో సహా అన్ని ప్రజా పోరాట రూపాలకు ఒక విశిష్టతను కలిగించింది. 1905 నాటి రష్యా విప్లవం నుండి కార్మికవర్గం అనేక పోరాట రూపాలతో పాటు సాయుధ పోరాటాన్ని కూడా అనేక రూపాల్లో చేశారు. 1905-1906 సంవత్సరాల్లో రష్యాలో పట్టణాల్లో చిన్న చిన్న కార్మిక బృందాలు ప్రజా పోరాటంలో భాగంగా. చేసిన గెరిల్లా పోరాటాలను లెనిన్ పూర్తిగా సమరించాడు. "గెరిల్లా యుద్ధతంత్రం" శీర్షికతో అతి ముఖ్యమైన "వ్యాసాన్ని 1906లో ప్రచురించాడు. బోల్షివిక్కులు ప్రతిచోటా “పోరాట "దళా"లను నిర్మించారు. జాతీయ ప్రతిఘటనా పోరాటాల్లో గెరిల్లా యుద్ధతంత్రం ప్రయోజనాన్ని మార్క్స్. ఎంగెల్స్లు స్పష్టం చేస్తే, లెనిన్ ఈ యుద్ధతంత్రాన్ని తిరుగుబాటు, అంతర్యుదాల లక్షణంగా కూడా బోల్షివిక్ విప్లవ క్రమంలో ఆచరణ ద్వారా చూపించగలిగాడు. 1918-1921 సంవత్సరాల్లో జరిగిన అంతర్యుద్ధంలోనూ, 1941-1945 సంవత్సరాల్లో ఫాసిస్టు దురాక్రమణకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలోనూ సోషలిస్టు రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున గెరిల్లా యుద్ధాన్ని ప్రయోగించి గొప్ప విజయాలను సాధించారు.