GUL MOHAR by POLKAMPALLI SANTHADEVI Telugu book cover

GUL MOHAR

by POLKAMPALLI SANTHADEVI

₹150
In stock · 17 available
PublisherPOLKAMPALLI SANTHADEVI
LanguageTelugu
నా మాట 1999లో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక నిర్వహించిన సస్పెన్స్ నవలల పోటీలో బహుమతి పొందిన నవల 'అడవిమంట'. పేరును బట్టి ఇది నక్సలైట్లకు సంబంధించిన కథ అని అపోహ పడే అవకాశం ఉంటుందని ఈ నవలను చదివిన ఒకరిద్దరు చెప్పడంవల్ల నవల పేరు 'గుల్ మొహర్'గా మార్చడం జరిగింది. ఈ నవలలో నక్సలైట్లకు సంబంధించింది లేదని కాదు. కథ చాలాభాగం గడిచాక, కథా గమనాన్నిబట్టి మాత్రమే ఆ సన్నివేశాలు వస్తాయి. ఈ నవలలోని కథ సినిమా కథలాంటి ఒక ప్రేమ కథ తప్ప ఎవరిని గురించి రాసింది కాదు. అప్పట్లో నక్సలైట్లకు సంబంధించిన, ఎన్కౌంటర్లకు సంబంధించిన వార్త ఏదో ఒకటి రోజూ కనిపించేది దినపత్రికల్లో, ఎన్ కౌంటర్లలో చనిపోయిన వాళ్ల వివరాలు చదువుతున్నప్పుడు... వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న తపనతో, ఆవేశంతో అడవులబాట పట్టి అర్ధాంతరంగా బలైపోయారే అని బాధ కలిగేది. అట్టడుగు వర్గాలపట్ల నిజమైన అర్ద్రత కలిగి వాళ్ళకోసం ఏమైనా చేయాలన్న ఆకాంక్షతో, ఆవేశంతో ఉద్యమంవైపు ఆకర్షితులౌతున్న యువత ఒక్క క్షణం ఆగి... ఆత్మ విమర్శ చేసుకోవాలన్న ఆశతో ఆ సన్నివేశాలు చిత్రించడం జరిగింది. అది రాయడానికి నేను పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకొన్నాను. మార్క్సిజం గురించిగాని, కమ్యూనిజం గురించిగాని నేను అధ్యయనం చేయలేదు. అజ్ఞాత సోదరుల గురించి రాయాలని అనుకొన్న తరువాత మాత్రం ఒకరిద్దరు పాత్రికేయులను కలిసి కొన్ని విషయాలను తెలుసుకోవడం జరిగింది. తన గురించి కాకుండా జనం గురించి ఆలోచించడం చాలా గొప్ప విషయం. ఆత్మశోధన, ఆత్మోన్నతివైపు సాగే యోగులు సైతం సమాజ సేవకు సమ ప్రాధాన్యతనిచ్చారు. "పూజలు చేసే చేతులకన్న సేవలు చేసే చేతులు మిన్న" అని రామకృష్ణ పరమహంస స్త్రీ చెప్పారు. ఆయన బోధనలు అణువణువునా జీర్ణం చేసుకొన్న స్వామి వివేకానంద కూడా-సమాజంలో అసంఖ్యాకంగా దీనులూ, దుఃఖితులూ ఉండగా వారి కన్నీరు తుడవకుండా చేసే ఏ యోగమైనా ఏ యాగమైనా వ్యర్థమేనని చెప్పారు. ఈ నవలలో కథానాయకి శ్రిత అనుకొన్నట్టుగా... ఉద్యమం అడవిలో అంతమై జనం మధ్య పురుడు పోసుకొంటే దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి, లంచగొండితనం, అత్యాచారాలు, కుల మతద్వేషాలతో కుళ్ళి కంపుకొడుతున్న వ్యవస్థను సమూలంగా చిటికెలో మార్చివేయగల రనిపిస్తుంది.