GULABI REKULU by THATIKOLA PADMAVATHI Telugu book cover

GULABI REKULU

by THATIKOLA PADMAVATHI

₹60
In stock · 28 available
PublisherTHATIKOLA PADMAVATHI
LanguageTelugu
నా మాట మనసులోని భావాలు అంతరంగాన్ని కదిలించి వేదనైనా రోదనైనా, నిర్విచార, నిస్సాయ స్థితిలో ఉన్న అనూహ్యమైన సంఘటనలు నన్ను కలవర పెట్టినపప్పుడు యదార్థగాధలు చూసినా, విన్నా స్పందించిన మనసు వాటిని కథలుగా మలచాలని అక్షర రూపంలో కాగితాలపై కలంతో యుద్ధం చేయాలనుంటుంది. ప్రేమలు, పెళ్ళిల్ళు వైవాహిక సంబంధ బాంధవ్యాలు, మోసపూరిత సందర్భ అసంఘటిత అసమానతలు ఆధారంగా తీసుకొని వ్రాసిన గులాబీ రేకుల్లాంటి కథలు మనసుకు హత్తుకునేవి కొన్ని మనసును మైమరపించేవి మరి కొన్ని రకరకాలుగా మరిచిపోలేనివన్ని వాటిని ఒక రూపకల్పనలో భావాలకు ప్రాణం పోసినవి. అభినందించిన వాళ్ళు, ఆశీర్వదించిన వారు నా కథా సంపుటికి ప్రాణం పోసినవారు, మరింత ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించిన ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఎంతో, మంది అండదండలుగా నిలిచిన వారు అందరికీ నా కృతజ్ఞతలు. కథల సంపుటి తీస్తున్నాననగా ముందు మాట వ్రాయటానికి ఎన్ని పనులున్నా తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి అడిగిన వెంటనే స్పందించి ముందు మాట వ్రాసిపంపిన శీలం జగతీధర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను. మరో కథా రచయిత వడలి రాధాకృష్ణగారు నా కథలను చదివి నా కథలపై ఆయన స్పందించి కథనరీతిలో గులాబీరేకులు గుభాళించిన వేళంటూ చక్కని భావాలతో అలుసున్నితంగా వ్రాసిన అక్షర గుబాళింపులు అందించినందుకు రాధాకృష్ణ గారికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు. ఎప్పటికప్పుడు మా కుటుంబ సభ్యులు నా కెంతో తోడ్పడి సహాయ సహకారాలందించినందుకు వారికి నేనెంతో ఋణపడి ఉన్నాను. అందరి అండదండలుంటేనే ఏదైనా ఒక పని సాధించ గలగటం సాధ్యమవుతుంది. గులాబీరేకుల్లాంటి కథలు చదివి వాటి పరిమళాలను ఆస్వాదిస్తారని ఆశిస్తాను.