
GULF GEETAM
₹200
In stock · 11 available
PublisherALAMBANA PRACHURANA
LanguageTelugu
గల్ఫ్ గీతం "నానా, ఇక్కడ నేను ఉంటోన్న హోటల్ చూశాక అమెరికా ఎంత వెనకబడి పోయిందో అర్థమవుతోంది," 2018 జనవరిలో దుబాయ్ నుంచి మా పాప మిన్నీ ఫోను! తను ప్రతి ఏడాదీ చేసే ఇండియా ప్రయాణంలో ఈసారి దుబాయ్ ని కూడా చేర్చి ఢిల్లీ నుంచి అట్లాంటా తిరిగి వెళుతూ దుబాయ్ లో ఆగింది. తన సహోద్యోగి పెళ్లి, దానితోపాటు మరో రెండ్రోజులు దుబాయ్ నగరం చూడటం- అదీ తన ప్రణాళిక. "బహుశా నువ్వు ఉన్నది కొత్తగా కట్టిన హోటలయి ఉండాలి. ఏదేమైనా అమెరికాకు దుబాయ్కూ పోలికేమిటీ? ఎంత ముచ్చటనిపించినా మరీ అంత పెద్ద సర్టిఫికెట్టా!" "కాదు కాదు. ఒక్క హోటలు గురించే నేను చెప్పడంలేదు. నిన్నంతా సిటీలో తిరిగాగదా, చాలా మోడ్రన్ గా ఉంది. రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్లు, మధ్యలో దుబాయ్ క్రీకూ, మాల్స్లో టెక్నాలజీని వాడుతోన్న విధానం- ఓసారి దుబాయ్ ప్రోగ్రాం పెట్టుకో, నీకు నచ్చుతుంది." అమెరికాలో అయిదేళ్లుగా ఉంటోన్న మనిషి ఆ మాట అంటోంటే కాస్తంత ఆశ్చర్యం, కొండంత కుతూహలం. పోనీ ఓసారి వెళదామా అన్న ఆలోచన, "అమరేంద్రగారూ! ఇటూ ఇక్కడా!" కలవని ఫోనుకోసం నాలుగోసారి ప్రయత్నిస్తోన్న నాకు ఆ మాట అమృతంలా సోకింది. వెనక్కితిరిగి చూశాను. రాజేష్! వేమూరి రాజేష్! "ఎమిరేట్కు స్వాగతం! మొత్తానికి రెండేళ్లు పట్టింది మీరు ఇక్కడికి చేరడానికి." నిజమే. మిన్నీ 2018లో వేసిన బీజం నిలదొక్కుకొని, మొలకెత్తి, మారాకు వెయ్యడానికి రెండేళ్లు పట్టేసింది. ఢిల్లీకీ దుబాయక్కూ మధ్య ఉన్న నాలుగు గంటల దూరాన్ని దాటడానికి నాకు రెండేళ్లు పట్టింది. 2020 ఫిబ్రవరిలో ఆ దూరం దాట గలిగాను. ఆయా ప్రాంతాల గురించి అరవై ఏళ్ల అరకొర జ్ఞానం నాది.