
GULLIVER SAHASA SAGARA PRAYANALU
₹150
In stock · 20 available
PublisherSMRUTHI PUBLICATIONS
LanguageTelugu
"గలివర్ యాత్రలు" అనే నవల గలివర్ అనే వైద్యుడు ఓడ మీద సముద్ర మార్గాన చేసే సాహసకృత్యాల గురించి.దీన్ని జొనాధన్ స్విప్ట్ రచించారు. ఈ నవల ప్రపంచపు అత్యుత్తమ వంద నవలల్లో స్థానం సంపాదించుకుంది. ఈ కథ నిజానికి నాలుగు భాగాలైనా, వాటిలో గలివర్ ది లిల్లీపుట్ (మరుగుజ్జు), గలివర్ ది జెయింట్ (మహాకాయుడు) అనే రెండూ బాగా ప్రాచుర్యం పొందాయి. పిల్లల్లో ,పెద్దల్లో ఒకేలా ఎంతో ఉల్లాసం నింపుతాయి. ఐతే, ఈ నవల లో మిగిలిన రెండు కథలూ,ప్రస్తుత ప్రపంచ సామాజిక, రాజకీయ, వైజ్ఞానిక పరిస్థితులను పోలి ఉంటాయి. కాళ్ళకూరి శేషమ్మ గారు దీన్ని గుర్తించి, తెలుగు పాఠకుల కోసం ' గలివర్ సాగర సాహస ప్రయాణాలు' పేరిట స్విఫ్ట్ నవలను స్వేచ్ఛానువాదం చేసారు. ఆసాంతం చదవండి. ఆశ్చర్యం, ఉత్సాహం, రెంటినీ మీ సొంతం చేసుకోండి.