GUMMADIKAYALA DONGA by KONDURI KASIVISWESWARA RAO Telugu book cover

GUMMADIKAYALA DONGA

by KONDURI KASIVISWESWARA RAO

₹30
In stock · 4 available
PublisherKONDURI KASIVISWESWARA RAO
LanguageTelugu
అసలు కథ ఉద్యోగానికై పొట్ట చేతబట్టి నగరానికి వచ్చిన నాగేంద్రకు దిల్వాలా వేసిన విచిత్ర, ప్రశ్నలకు జవాబులు చెప్పలేక పెద్దసైజు రుమాలుతో ముఖం తుడుచుకొని, మెళ్ళో కట్టుకొని, కోపంలో మీసం మెలిపెడుతుండగా “కేడీ” లా కన్పించాడు కానిస్టేబుల్ నామాలుకి. నగర మ్యూజియంలోని కోట్ల రూపాయల విలువ గల వజ్రాన్ని దొంగలముఠా దొంగిలించింది. పోలీసులు రంగంలోకి దిగి దొంగల్ని పట్టుకోవడం కోసం ఛేజింగ్ ప్రారంభించారు. ఆ దొంగలముఠా మారువేషాల్లో తిరుగుతున్నారని సమాచారం. వాళ్ళు భక్తులు కావచ్చు, సన్యాసులై వుండవచ్చును, ముష్టివాళ్ళుగా తిరుగుతుండవచ్చును. లేక పాటలు పాడుకునే గాయకుడి గంగాధరం వేషంలో తిరుగుతుండవచ్చును. ఈ గాలింపులో కొంతమంది నకిలీలు, కొందరు అసలైనవారు. అడుగడుగునా సంగీతభరితమైన పాటలు, భక్తుల భజనలు, ఉ త్కంటభరితమైన సన్నివేశాలతో సాగే ఈ నాటిక ప్రేక్షకులకు హాస్యాన్ని, వినోదాన్ని అందిస్తుంది. తెలుగు సామెతతో ఉద్భవించిన ఈ "గుమ్మడికాయల దొంగ" హాస్యనాటికలోని పాత్రలు కేవలం కల్పితాలు మాత్రమే, అవి ఏ ఒక్కరినీ ఉ ద్దేశించి వ్రాసినవి కావు. ఈ నాటిక మెదటి ప్రదర్శనలో నటించిన OFPM-MEDAK కళాకారులు శ్రీయుతులు అయ్యంగారి రాములు, జయచందన్, సురేందర్, కె. దుర్గారావు, యన్. నర్సింలు, యన్. వెంకటేశ్వర్లు మరియు మాస్టర్ ఉ జ్వల్ కొండూరిలకు శుభాశిస్సులు. ఈ నాటికను ప్రదర్శించాలనుకునేవారు, ప్రదర్శించినవారు, కళాకారులు, సాంస్కృతిక సంస్థలు, నాటక సమాజములు నా చిరునామాకి లెటర్ ద్వారా, ఫోన్ ద్వారా తమ వినోదమును, ఆనందమును తెలియజేయవలసినదిగా కోరుచున్నాను.