
GUNA - ADHUNIKA YUVA GEETHASARAMSAM
₹135
In stock · 26 available
PublisherGODAVARI PRACHURANALU
LanguageTelugu
వ్యక్తిత్వ వికాసానికి 'గురు'త్వం వహించే గ్రంథం Topdolconపల్లి రామమోహనరావు వారతదేశంలో 'భగవద్గీత'పై వచ్చినన్ని వ్యాఖ్యానాలు మరే పుస్తకం మీద వచ్చి అందులో అర్జునుడు పోరాటానికి వెనుదీస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని మళ్లీ యుద్ధానికి చెయ్యడం ప్రధానవస్తువు. ఇదెన్ని విషయాలకైనా అన్వయిస్తుంది. వ్యక్తి, నిరాశలో కుపోయినప్పుడు అతనిని ప్రోత్సహించి, కార్యదీక్షాదక్షుడిగా చెయ్య డమనేది ఒక శాశ్వత వస్తువు స్వాతంత్య్రపోరాటం వచ్చినప్పుడు, ఇంకా అనేక ఉద్యమాలు వచ్చినపుడు సంఘర్షణ పూర్తి కోసం, ఉద్యమానుగుణమైన విభిన్న వ్యాఖ్యానాలు రాయబడినై. అంతగా వ్యాఖ్యాన దానికి అవకాశమిచ్చే విస్తృతి, లోతు భగవద్గీతలో ఉన్నై. మత వేదాంతాది భావాలతో సుబంధం లేకుండానే, భౌతికమార్గంలో విజయం సాధించే అంశాలు భగవద్గీతలో కోకొల్లలుగా ఉమై మొత్తమ్మీద ఒక వ్యక్తిని, నిత్య సందేహాలతో, నిరాశతో కొట్టుమిట్టాడేవాణ్ని 'విజేత'గా చెయ్యడమే భగవద్గీత లక్ష్యం.. 'బర్న్ టు విన్' అనే సూక్తిని, దృఢపరుస్తుంది భగవద్గీత. అందుకే అర్జునుడు భగవద్గీత విని విజయుడిగా మారిపోయాడు. ఈమధ్యకాలంలో రాసేవాళ్ల ప్రాచీన గ్రంథాల్ని కూలంకషంగా అధ్యయనం చేసి వ్యాఖ్యానాలు రాస్తున్నారు. ఈకోవలో వస్తున్నదే మిర్తిపాటి శ్రీనివాస్.. ఇప్పుడు వెలువరిస్తున్న 'గురు' అనే బృహద్గ్రంథం. భగవద్గీతకు ఒక కొత్త వ్యాఖ్యానంగా రాసిన ఈ గ్రంథం సమర్థంగా రాశారు. పూర్వసాహిత్య పరిశీలన, స్వాతంత్య్ర పోరాటం వంటి ఉద్యమకాలంలో వచ్చిన భావ వైవిధ్యం మొదలైన వాటిని లోతుగా అవగాహన చేసుకొని రాశారు. అంతేకాదు రాసే విధానంలో చదువరిని ఆక ట్టుకునే శైలి ప్రశంసనీయంగా ఉంది. గొప్ప రచయితల ఉటంకింపులు, అనేక సన్నివేశాల ఉదాహరణలు, సరళమైన వ్యాక్య నిర్మాణాంశాలను సమర్థంగా ఉపయోగించుకున్నారు. వ్యక్తిత్వ వికాసానికి 'భగవద్గీత' ఎలా ఉపయోగపడుతుందన్నది ఈనాటి యువతకు అందించాల్సి ఉంది. అన్నీ ఇతరదేశాల నుండే వచ్చినై. ఈదేశంలోని గతంలో ఏమీలేదు అని భావించేవారికి ఈ గ్రంథం ఒక కనువిప్పు కాగలదని నమ్ముతున్నాను. పూర్వులు లోకజ్ఞానానికి ఎంత ప్రాముఖమిచ్చారో, గమనింపలేనివారికి కూడా ఈ గ్రంథం, అమితంగా ఆచరణీయం కాగలదు. మిర్తిపాటి శ్రీనివాస్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి కృషిని నిరంతరాయంగా కొనసాగిస్తూ.. మన సమాజంలో అనేకమంది 'విజేత'లను రూపొందించాలని కోరుతున్నాను... 'విజయోస్తు'