GUNDAVARAPU SUBBARAO RACHANALU by ANDHRAPRADESH PRAJANATYA MANDALI Telugu book cover

GUNDAVARAPU SUBBARAO RACHANALU

by ANDHRAPRADESH PRAJANATYA MANDALI

₹30
In stock · 36 available
PublisherANDHRAPRADESH PRAJANATYA MANDALI
LanguageTelugu
సుబ్బారావు... గుండవరపు సుబ్బారావు.... చిన్నవయస్సులో ఈ సమాజంలో అన్నింటినీ ఆకళింపు చేసుకున్న మేధావి. సమయోచిత, సందర్భోచిత, సమర్థ సంభాషణలతో ఎదుటి వారిని ఆకట్టుకోగల జ్ఞాని. ఒక సందర్భంలో భగత్ సింగ్ సినిమాను ప్రతిపాదించి, దానికి ఆమోదముద్ర వేయించడమే కాకుండా నన్ను ఆ పాత్రలో చూపించేందుకు కూడా ఒప్పించిన నేర్పు సుబ్బారావుది. అభ్యుదయ కవి సుబ్బారావు. నేను ఎంతోమంది రచయితలను ఇలాంటి పేరుతో చూసాను, విన్నాను. కానీ ఇంత సామాజిక స్పృహ కలిగిన అభ్యుదయ నాకెక్కడా తగల్లేదు. రాజకీయాలు, సమాజం, బడుగు, బలహీన వర్గాలేకాదు, మధ్య తరగతికి చెందిన సుబ్బారావు సంపన్నులను సైతం పరిపూర్ణంగా చదవగలిగిన శక్తి మంతుడు. ప్రతి వర్గాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకోగలిగిన హసంపన్నుడు. ప్రతి మనిషికి ఉన్నట్లే ఇంతటి జ్ఞానికి కూడా ఓ ఒలహీనత... ప్రతి వేదవాడి మనస్సును తట్టగలిగే శక్తి కలిగిన సుబ్బారావు నాకు హితుడేకాదు... మరిచిపోలేని మిత్రుడు. చరిత్ర, పురాతన చరిత్ర, రాజులు, మావోలు, ఇలా ఆధునిక యుగాలను సైతం జోడించి ప్రతి ఒక్కరిని మెప్పించగల మేధావి మన్నారావు. ఇలాంటి సుబ్బారావు మళ్ళీ... మళ్ళీ... ఇంకా... ఇంకా మంచిగా... చెట్టాలని కోరుకుంటా...