
GUNDE JABBULU - NIVARANA - CHIKISTA
₹100
In stock · 20 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
గుండె జబ్బులు - నివారణ చికిత్స పెరుగుతున్న గుండె సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులకు గురవుతున్న వారిలో ఆసియావాసులే అగ్ర స్థానంలో వున్నారు. జీవన విధానంలో వచ్చిన మార్పులు ఈ పరిస్థితికి కారణం. సుబ్బారావు క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ (కొవ్వు), రక్తపోటును డాక్టరుతో పరీక్ష చేయించు కుంటారు. చివరకు సుబ్బారావుకు కరోనరీ ఆర్టిరీ వ్యాధి ఏర్పడినట్టు బయటపడుతుంది. ఆయన వంశానుగత చరిత్ర యిందుకు కారణంగా తెలిసింది. 48 ఏళ్ళ సుబ్బారావు అమెరికాలో వున్నాడు. తనకు కరోనరీ ఆర్టిరీ వ్యాధి వస్తుందని, ఆసియా సంతతికి చెందిన వారిలో ఎక్కువగా వుంటుందని సుబ్బారావు ఊహించలేదు. అయితే భారత్, పాకిస్తానీయులు పూర్వీకులు వంశచరిత్ర చూసినట్లయితే, ఈ దేశీయులకు చెందిన సంతతి వారిలో గుండెజబ్బులు అధికంగా వున్నాయని తాజాగా గుండె వ్యాధులపై జరిపిన పరిశోధనల్లో నిర్ధారణ అయింది. గుండెజబ్బులకు దారితీసే అలవాట్లు గల సామాజిక నేపథ్యం ప్రధానంగా కారణమవుతుంది. పొగతాగడం విడిచిపెట్టడంతోపాటు, శాకాహారం ఎక్కువగా తీసుకోవడంవల్ల ఈ వ్యాధిని అదుపులో వుంచవచ్చు. అయితే ఈ వ్యాధికి గురి కావడానికి పొగపీల్చడం, ఆహారపు అలవాట్లు మాత్రమే గాక యింకా పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. ఐరోపా లేదా పశ్చిమాసియా దేశాల ప్రజలకంటే భారతీయ సంతతికి చెందిన వారిలో మూడురెట్లు అధికంగా గుండె జబ్బులు వున్నాయని పరిశోధకులు వెల్లడించారు. తాజా నిర్ధారణలు ఇటీవల విడుదలైన నివేదికలో వెల్లడయ్యాయి. ఈ నిర్ధారణకు అనేక మంది భారతీయ అమెరికా డాక్టర్లు, ఇతర దేశాల డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు.