GUNDE TERACHAPA by DATLA DEVADANAM RAJU Telugu book cover

GUNDE TERACHAPA

by DATLA DEVADANAM RAJU

₹25
In stock · 2 available
PublisherDATLA DEVADANAM RAJU
LanguageTelugu
అలలతో చెలిమి చేసే పద్యం నైరుతి దిక్కు మీద గుర్తు తెలీని చిత్రకారుడు కొత్త రుతువుని రచించినపుడల్లా ఆహ్లాదంతో గుండె కాన్వాసు మీద కవి కొత్త రేఖలు దిద్దుకుంటాడు. ఇక మనమంతా ఇంట్లోంచి వానలోకి పారిపోవాల్సిందే. ఎండల్లో మాడి సలసల కాగిన దేహాలకి తొలకరి లో కురిసిన మొట్టమొదటి వర్షపు చినుకులా సేద దీరుస్తుంది దాట్ల దేవదానం రాజుగారి కవిత్వం. ఇంత చదువూ చదివి యీయన సగం చెట్టు కూడా ఎక్కలేరు. అయినా రాజుగారి సాంగత్యం తియ్యని కొబ్బరి నీళ్ళలా వుల్లాసాన్నిస్తుంది. కోనసీమ అందాలని మంచి ప్రతీకలతో ఒడుపుగా పట్టుకున్నాడీయన. అడుగడుగునా పచ్చని చేలతో తారాడే త్రాచుపాములాటి కాలవలతో పొడుగాటి రహదారులతో, ప్రతిబింబాలతో, కొబ్బరి చెట్లతో అలరారుతుంది. కోనసీమ. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి గుండె మీద ప్రకృతి చిందులు వేస్తుంది. అలాంటపుడు కోనసీమకి ఇద్దరి పుట్టి పెరిగిన రాజుగారు గుండె తెరచాప విప్పుకొని పాడటంలో ఆశ్చర్యం ఏముంది ? ఇక్కడి మట్టి రేణువుల్ని దోసిళ్ళతో ఎత్తుకుని పూజిస్తాదీయన. పాలం చెలకల్లో పచ్చటి తీగల్ని ఆప్యాయంగా ఒంటికి దుస్తుల్లా ధరిస్తాడీయన. ఈ మట్టి వాసనలోని అమ్మ జ్ఞాపకాన్ని ఏరుకుని తన్మయుడవుతాడు. మట్టి రేణువుల్లో తన్ను తాను పాతుకుని వేలకువేల జీవకణాలుగా విస్తరిస్తాడు. ఇతని దృష్టిలో వర్షానికి ప్రతిబింబం పైరు. ఆకాశంలో కూడా ఆకుమడి ఛాయ చూడగలడు. ఇతనికి చేనంటే ఆకుపచ్చని స్వప్నం వర్షం అంటే మెతుకుల సందర్భం.