
GUNDELAVISINACHOTA
₹95
In stock · 22 available
PublisherSIRISILLA GAFOOR SHIKSHAK
LanguageTelugu
“గుండెలవిసినచోట” నా మాట ఇది గాయాల చోటు, నయవంచనకు గురై, దుఃఖం నిండి దశాబ్దాల వలస పాలన లో అతలాకుతలమై చోటు. ఆధిపత్యపాలనలో సర్వం కొల్పోయిన చోటు. "గుండెవిలసిన చోటు" నెత్తురు పారిన చోటు, పోరాట బీజాలకు అంకురార్పణ చేసే ఈ మట్టిని దేహానికి రుద్దుకొని తిరుగుబాటు జెండాలు ఎగరవేసి మాత ఋణం తీర్చడానికి వీరులు మరణాన్ని ఆహ్వానించిన చోటు. "గుండెవిలసినచోటు". యొక్క ంచిన జిక ఈ ప్రాంతమంతా సమస్యలమయ్యి, గుండెలన్నీ ఆవేదనలతో నిండిపోతే, పూటగడవని బిడ్డల ఆకలిని తీర్చలేని నేలతల్లి విముక్తి దారిని చూపి పోరాట పాఠాలను నేర్పితే, ఉద్యమ బాటలో పయనించి, అమరులైన ఒక్కొక్క పుత్రుడిని, ప్రాణాల త్యాగాన్ని హత్తుకొని దిక్కులు పిక్కటిల్లేలా, ఆకాశం దద్దరిల్లేలా అరుస్తున్న *గుండెలవిసినచోట". ఇక్కడి ఒక్కొక్క వీరుడి త్యాగం వేవేల సూర్యుళ్ళకు జననం. ఇక్కడి ప్రతి వీరుడికీ మాత ఋణం తీర్చడమే నినాదం. చరిత్రలో లిఖించబడని వీరులు ఈ ప్రాంతంలో ఎందరెందరో, కలం పట్టిన వీరులు, కదనరంగ శూరులు. ఇంటింటికో వీర రత్నమిక్కడ. వీధి వీధికో వీరుల సైన్యమిక్కడ, ఇక్కడి చెట్లు చైతన్య గాలిని వీస్తాయి. అమ్మ తన బిడ్డకు గోరుముద్దల్లో అనురాగంతో పాటు వీరత్వాన్ని కలిపి తినిపిస్తుంది. ఇక్కడి వీరుల త్యాగాన్ని, పోరాటపటిమను ఏ చెట్టునడిగినా, ఏ పుట్టనడిగినా చెబుతుంది. తిరగేసే చరిత్ర పుస్తకాల్లో తప్ప. బాలుడు పెరిగాక ఉద్యోగ బాట కనిపిస్తుందో లేదో కానీ, పోరాట బాట, విముక్తి బాట తనకు తానై తనకు తెలియకుండానే రహదారై, ఆహ్వానమై విస్తరించుకుంటూ పరుచుకుంటుంది. పోరాటంలోనే జీవితాలు పూర్తిగా అంకితమైన నేల ఇది. పోరాటాలను, ఉద్యమాలను వారసత్వంగా అందించే వీరులు భూమి ఇది. ఇక్కడి ప్రజలు అలుపెరగని పోరాటల వేరులు. తమ మనుగడను కాపాడుకోవడానికి చేసే పోరాటాల్లో జీవితాలే "చిపోతున్నాయిక్కడ. అందుకే ఇది పోరు తెలంగాణ. వీర తెలంగాణ.