
GUNDELOTHU - KATHALA SAMPUTI
by S.SRIDEVI
₹70
In stock · 3 available
PublisherS.SRIDEVI
LanguageTelugu
గుండెలోతు ప్రేమంటే ఏమిటో తెలియకుండానే జీవితపు చరమాంకంలోకి చేరుకునే వారెందరో. ఆపైన సంధ్య వాలుతుంది. మృత్యువు కబళిస్తుంది. వికసించని మనసు మొగ్గగానే రాలిపోతుంది. ఈ వాస్తవం తెలీక ఎందరో ఆడా మగా కలిసి మాట్లాడుకోగానే అదే ప్రేమనేసుకుని ఎంతో దూరం ఊహించుకుంటారు. దీనికి నేను మినహాయింపు కాదు. కాబట్టే ఎముకలు కొరికే చలిలో ఈ ప్రయాణం. మనిషి ఏదేనా తెలివైన పని చెయ్యటానికి ప్రత్యేకించి ఏ కారణమూ ఉండదు. అదే ఒక పిచ్చిపని చెయ్యటానికి ఒక చిన్న అనుమానమో, సరదానో కారణమౌతుంది. నా విషయంలోనూ అంతే జరిగింది. సరిగ్గా ఇరవైనాలుగు గంటల క్రితం. శ్రీమతి వాసంతి గారికి, నా పేరు భాస్కర్, సామంత్ బిజినెస్ పార్ట్నర్ని. సామంత్ పేరు చెప్పాను గాబట్టి ఇంకే వివరాలూ అక్కర్లేదనుకుంటాను. ప్రస్తుతం సామంత్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. డాక్టర్లు అతను బతికే అవకాశం లేదని చెప్పేశారు. రెండు కిడ్నీలూ చెడిపోయాయి. లంగ్స్ కూడా దెబ్బతిన్నాయి. బతుకుమీది విరక్తితో వాడింతదాకా తెచ్చుకున్నాడు. ఆ విరక్తికి గల కారణమేమిటో వాడెప్పుడూ చెప్పలేదు. వాడొద్దనుకున్న గతాన్ని కెలకడం ఇష్టంలేక నేనూ ఎప్పుడూ అడగలేదు.