GUNTUR NAANEELU by K.J.RAMESH Telugu book cover

GUNTUR NAANEELU

by K.J.RAMESH

₹40
In stock · 8 available
PublisherK.J.RAMESH
LanguageTelugu
“ నానీయమయిన గుంటూరు" గుంటూరు జిల్లా ప్రత్యేకతను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చారిత్రకంగా, రాజకీయంగా, సామాజికంగా, ఆర్ధికంగా, వాణిజ్యపరంగా, సాంస్కృతికంగా ఈ జిల్లా ఎన్నో విధాలుగా తన ప్రత్యేకతను తాను కలిగివున్నది. వీటి అన్నింటినీ దృష్టిలో వుంచుకొని “గుంటూరు నానీలు" వ్రాయటం జరిగింది. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ జిల్లాను ఈ కొద్ది నానీలతో స్పృశిం చటం కష్టమే. అయినా సాధ్యమైనంత మేర కృషి చేశాను. స్పర్శించని అంశాలు ఏమయినా ఉంటే వేరే ఉద్దేశం మాత్రం కాదు. నానీలుగా ఇది నా రెండవ సంపుటి. ఇంతకుముందు "పాయలు" నానీలు అందరినీ అలరించాయి. ఈ సంపుటికి కూడా “గుంటూరు వెళ్ళాను" అంటూ ముందు మాట వ్రాసిన పెద్దలు, ప్రముఖకవి డా||ఎన్. గోపి గారికి నా హృదయపూర్వక వందనాలు. అంకితంగా స్వీకరించిన గౌరవనీయులు శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారికి నా హార్ధికాభినందనలు. పెద్దలు, హితైషులు డా|| బీరం సుందరరావు గారికి నా ప్రత్యేక అభివందనములు. కష్టసుఖాల్లో నేనున్నానని ధైర్యమిచ్చే నా శ్రీమతి ఝాన్సీకి ఆశీపూర్వక అభినందన. కుమారులు చిరంజీవులు కొర్రపాటి సునీల్, కొర్రపాటి అనిల్ కుమార్లకు ఆశీస్సులు.