GUNTURU GONGURA COMEDY KATHALU by VANISRI Telugu book cover

GUNTURU GONGURA COMEDY KATHALU

by VANISRI

₹99
In stock · 5 available
PublisherVANISRI
LanguageTelugu
ముందు మాట "గుంటూరు గోంగూర కామెడీ కథలు'కి ముందుమాట రాయమని వాణిశ్రీ గారు అడగ్గానే, ముందుగా, గోంగూర రుచి గుర్తొచ్చి, ఆ రోజు ఆసుపత్రిలో ఇంకేమీ పని చేయబుద్ధి కాలేదు. త్వర త్వరగా ఇంటికి వెళ్ళి, అంతకు ముందు వారమే, గుంటూరు నుంచి తెచ్చుకున్న గోంగూర పచ్చడిని, వేడి వేడి అన్నంలో కలిపి, నెయ్యిలో మెలిపి, ముద్దల్ని ఉల్లిపాయల్తో నలిపి, 'బ్రేవు' మని తేన్చి అప్పుడు కామెడీ' కథలు చదవడం మొదలు పెట్టాను. నిజం చెప్పాలంటే గుంటూరు గోంగూర కథలో హాస్యం కంటే అపహాస్యం ఎక్కువుంది లంచం మీద. పెట్టెలో ప్రాణం నాకు బాగా నచ్చిన కథ. జీళ్ళ పాకంలా సాగదీసి, సాగదీసి ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టే T.V. సీరియల్స్ మీద అద్భుతమైన సెటైర్. అమెరికా అల్లుడు జీరో సైజ్ మీద అందమైన ఎత్తిపొడుపు. ఈ కథ చదివి Beauty Parlor ఆసాములు రచయిత మీద కయ్యానికి కాలు దువ్వుతారేమోనని నాకైతే ఒకింత భయం వేయకపోలేదు. "కట్నం అడిగే అల్లుడి కన్నా, సంతలో కొనుక్కున్న ఎద్దుమిన్న" నూటికి నూరు శాతం నా ఓటు ఎద్దుకే - భీముడు వర్సెస్ రాముడు కథలో, ఇంటి పేర్లతో ఆడుకోవడం రచయితకి ఇష్టమయిన ప్రక్రియ అనుకుంటా లేడీబాస్తో T.B.K.Rao పెట్టెలో ప్రాణంలో బొందలు బొజ్జన్న నా కాలేజీ రోజుల్లో ఇద్దరిపేర్లు ఇంటిపేర్లతో కలిపి, విరిపి, నవ్వుకునేవాళ్ళం. ఒకరు డా॥ కేశవమూర్తి. ఆయన పేరు విరిపి, డా.కే. శవమూర్తి అనేవాళ్ళం. ఇంకాయన దగ్గరికి ఏ పేషెంటు వెళ్తాడు చెప్పండి. మా ఇంగ్లీషు గురువుగారి పేరు D. Rama Rao మధ్యలో చుక్క ఎత్తేసి DRama Rao అనేవాళ్ళం.