
GURAJADA MANA VIMARSHAKULU
₹100
In stock · 9 available
PublisherDR.P.RAMESH NARAYANA
LanguageTelugu
ముందుమాట మహాకవి గురజాడ ఆంధ్రదేశంలో జన్మించడం తెలుగువారు చేసుకున్న ఎన్నోజన్మల పుణ్యఫలం. సంస్కృతానికి వాల్మీకి మహాకవి, గ్రీకుభాషకు హెూమర్, లాటిన్ భాషకు వర్జిల్, రష్యన్సాహిత్యానికి టాల్స్టాయ్ వంటి వారిని ప్రపంచనాటకరంగంలో ఇబ్సెన్, బెర్నార్డో వంటి వారిని ఆయా భాషాసాహిత్యాలకు ఎంతో విశిష్టతను ఆపాదించిన మహానుభావులుగా సాహిత్యకారులు తరుచుగా పేర్కొంటారు. తెలుగుభాషాసరస్వతికి అదేవిధంగా ఆధునికసాహిత్యంలో సాహితీరంగవల్లులు తీర్చిదిద్దిన మహాకవి గురజాడ అప్పారావు. తెలుగుసాహిత్యం పండితభాషలో కొందరికి మాత్రమే అందుబాటులో వుండిన కాలంలో ఆధునికదృక్పథంతో దానిని ప్రజలభాషలో రూపొందించి వ్యావహారిక భాషావ్యాప్తికి నడుంకట్టిన నవయుగ వైతాళికుడు గురజాడ. "తెలుగుసాహిత్యాన్ని సంకెళ్ళువేసి కడుపు మాడ్చడమా లేక దానికి జవసత్వాలిచ్చి దాన్ని ఒక గొప్ప నాగరికశక్తిగా చేయడమా అనేది మనపై ఆధారపడిఉంది' అని ప్రకటించి, 'మంచి గతమున కొంచెమేనోయ్' అనే భావనతో ఆధునిక తెలుగుసాహిత్యరీతులకు దిశానిర్దేశం గావించినవాడు గురజాడ. గురజాడ రచనలు, డైరీలు, లేఖలు, అవీఇవీ అన్నీ ఆయన సమగ్రవ్యక్తిత్వాన్నీ, ఆయనకు సమాజంపైనా, మనుషులపైనా గల స్పష్టమైన అభిప్రాయాలనూ వ్యక్తీకరిస్తాయి. తన సమకాలీన తెలుగుసమాజంలో శతాబ్దాలుగా పేరుకుపోయిన ఛాందసధోరణు లన్నింటిపైనా కథానికలుగా, కవితలుగా, లేఖలుగా తన భావాలను వ్యక్తపరచి నవ్యసాహితీరీతులకు బాటలు వేసిన అభ్యుదయవాది గురజాడ. ఆధునికసాహిత్యంలో అభ్యుదయభావాలు ఆయన వచనంలోనే అంకురించాయి. (ఆరుద్ర, 1985), ఆయనలో మనకొక ద్రష్ట కనిపిస్తాడు. (కొత్తపల్లి రవిబాబు, 1992) అని ఎందరో తెలుగుసాహితీవేత్తలచే ప్రశంసలు అందుకున్నవాడు గురజాడ మహాకవి. 53 సంవత్సరాల భౌతికజీవితమూ, 30 సంవత్సరాల ఉద్యోగబాధ్యతలతో కూడిన సాహిత్యరచన, 150 ఏళ్ళపైగా సామాజిక అస్తిత్వమూ, 100 ఏళ్ళకుపైగా సాహిత్యవిమర్శ కలిగిన గురజాడకు ఎందరో సాహితీవేత్తలు, విమర్శకులు, రచయితలు, వందలాది విమర్శలు తన సాహిత్యంపై వెల్లడించిన విశేషనేపథ్యం ఉంది. గురజాడ సాహిత్యం