GURAJADA RACHANALU KATHANIKALU by GURAJADA APPARAO Telugu book cover

GURAJADA RACHANALU KATHANIKALU

by GURAJADA APPARAO

₹60
In stock · 15 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
కథానికలు ... " ఆ వూరి నల్ల కొండలనంతటను శిథిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడివారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, వారు స్నానమాడని గుంటలూ లేవు. ఒక్క పెద్దగుహలో నున్న బౌద్ధ విగ్రహమును శివుడని, దాని పక్కనున్న దేవీ విగ్రహమును గౌరి అని భావించి జంగాలు పూజ చేస్తున్నారు. (మీ పేరేమిటి?) "ఏం పాట్లొచ్చాయి దేవుళ్ళకి?” "దేవుళ్ళకి ఏ పాట్లూ లేవు! మన సాపాటు మాట ఆలోచించరేం?” (మతము : విమతము) "బాబూ కోపగించితే చెప్పలేనుగాని ఆడారు చదువునేరిస్తే యేటౌతది?... ఆడదాయి చెప్పకుండా పుట్టినారింటికి యెల్తానంటే లెంపలాయించి, కూకోబెట్టాలి గీని మొగారిలాగ రాతలు కోతలు మప్పితే ఉడ్జోరం పుట్టదా బాబూ?” "భగవంతుని సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువు స్త్రీ రత్నమే... నీ కూతురు బడికి వెళుతున్నదికదా! విద్య విలువ నీకే బోధపడుతుంది”. (దిద్దుబాటు) “వేదాలలోని మిస్టిసిజం వేద పండితులకే అర్థంకాదు. ప్రత్యక్ష జీవితంలో మనం ఎదుర్కొంటున్న విషమ సమస్యలను పరిష్కరించుకునేందుకు యీ వేద విజ్ఞానం ఒక్క పిసరు అక్కరకు రాదు. ఏ జ్ఞానం గురించి పండితులు మాట్లాడుతున్నారో, ఆ విజ్ఞానం అందరికీ అందేది కాదు. కొంతమందికే సాధ్యం ; అదైనా నాకు సందేహమే.” "అయితే మనకు పనికి వచ్చే జ్ఞాన మెలాటిదంటారు?” “అది ఒకే ఒకటి ; యుగయుగాల జీవితానుభవం ; ఈ విజ్ఞానమే మన దైనందిన జీవితానికి సహాయకారి. చీకటి నుంచి వెలుగులోకి తెస్తుంది". (సంస్కర్త హృదయం) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004