GURAJADA SAHITHI AVEE IVEE by DAVULURI KRISHNAKUMARI Telugu book cover

GURAJADA SAHITHI AVEE IVEE

by DAVULURI KRISHNAKUMARI

₹150
In stock · 6 available
PublisherDAVULURI KRISHNAKUMARI
LanguageTelugu
మా మాట భిన్న విభిన్న సందర్భాల్లో పుట్టిన పరిచయాత్మక వ్యాసాల సంపుటి ఇది. ఈ వ్యాసాల్లో విషయం గౌరవనీయంగా ఆసక్తికరంగా ఇమిడి ఉంటుంది. వ్యక్తీకరణ సరళ వాక్యాలతో అధికారికంగా ఉంటుంది. ప్రతిపాదన ఆలోచనాత్మకమైన అవగాహన, విస్తృతమైన అధ్యయన అనుభవం, సునిశిత పరిశీలనలతో విస్తరంగా ఉంటుంది. విశ్లేషణ పైపైన కాక తగినన్ని ఉపపత్తుల వినూత్నాంశ శక్తితో విభిన్న దృక్పథాల్ని ప్రసరింపచేసే సమాచార సేకరణ సామర్థ్యంతో పరిపక్వంగా ఉంటుంది. ఆవిష్కృతి సిద్ధాంత ఆకళింతతో సముచితంగా ఉంటుంది. రచన సమగ్ర పర్యావలోకనకు, చారిత్రక దార్శనికతకు, సర్వ గ్రంథ పారదర్శకతకు తీర్పుగా ఉంటుంది. ఈ వ్యాసాలు అవసరం తన్నుకుని వచ్చినప్పుడు తప్పనిసరి అయి రాసినవే గాని పట్టుమని కూర్చుని నికరంగా రాసినవి కావు. వీటి మాదిరినే ఎన్నో ఏళ్లుగా గాలిస్తూ వస్తున్న 'విజయనగరం భాష'పై ఉన్న ఆలోచనల తుట్టెలతో రూఢిపడిన ఒక పంథా లోలోన దాగి ఉంది. ఆ అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తెప్పించగల ఏదొక సందర్భం అనువుపడి ఉండినట్లయితే మరో పరిశోధక వ్యాసం వీటికి జతపడి ఉండేది. ఉన్న ఈ కొద్ది వ్యాసాలైనా పత్రికల, ఆకాశవాణి సాహిత్య సంచికా కార్యక్రమాల సౌజన్యంతో వెలువడ్డవే. అయినా రాసిన చెప్పిన ప్రతిదీ భద్రపరచుకోవాలనే సంకల్పం ఈ రచయితకు పట్టనిదని చెప్పాలి. ఆ కారణంగా ఇవి మా ఇంట్లోని, ఆయా గ్రంథాలయాల్లోని పాతపత్రికల నుంచి సేకరించినట్టివి, చిక్కని వాటికి అసమగ్రమైనా స్వదస్తూరితో (రచయిత) ఉన్న చిత్తు ప్రతినుంచి శుద్ధంగా ఎత్తిరాసినట్టివి, ఆకాశవాణి ప్రసంగాలను టేపురికార్డరు ద్వారా వింటూ సిద్ధంచేసినట్టివి. ఇలా సాధ్యపడినంతలో సమీకరించుకుంటూ వచ్చిన వ్యాసాలను విషయస్పష్టత కొరవడని చోట పునరుక్తతల మినహాయింపులు వంటి సరిచేతలతో ఒక క్రమ పద్ధతిలో తీర్చినట్టి, ప్రసక్త అముద్రిత అలభ్య అనువర్తిత సమాచారాంశాలకు(9) మాదిరి ప్రమాణాలు క్రమబద్ధంగా అనుసంధానించినట్టి సంకలనం ఇది. దీనిలో గురజాడ బహుముఖీన కవిత్వ పటుతను, ఆనాటి చారిత్రక కథనాలను 'గురజాడ సాహితి' అనే భాగంగాను, వైవిధ్యవంతమైన ఇతర అంశాలను 'అవీ-ఇవీ' అనే భాగంగాను కూర్చబడింది. చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 14 అంశాలు గల ఈ సంపుటి గురజాడ సాహితిలోని అనుసరణీయ పార్శ్వాలను, ఇతర పరామర్శల సొంత విజ్ఞతను, కవుల ఆదర్శనీయ సిద్ధాంతాలను ద్విగుణీకృతం చేసింది.