GURI KATHALU by MALLIPURAM JAGADEESH Telugu book cover

GURI KATHALU

by MALLIPURAM JAGADEESH

₹150
In stock · 69 available
PublisherSNEHAKALA SAHITHI PRACHURANA
LanguageTelugu
గురి ఎండిపోయిన మాని మొజ్జు మీద లక్ష్యం రెక్కలల్లాడిస్తోంది. విలుకాడు విల్లుని సంధించాడు. నారిని మరింత బలంగా తనవైపుకి లాగి లక్ష్యదూరాన్ని అంచనా వేసేడు. దగ్గర్లోనే వుంది. మబ్బు పట్టిన ఆకాశం... స్తంభించిన గాలి... ఊపిరాడనట్టు ఉక్కపోత. శిలా విగ్రహాల్లా చెట్లు. గుబురులో ఒకే ఒక ఆకు మాత్రం అదే పనిగా రెపరెపలాడుతోంది పిచ్చిపట్టినట్టు. విలుకాడి నుదుటి మీది చెమట బొట్టు ఎడమ కన్ను ప్రక్కగా చెంపమీదికి జారింది. అతని వెనుక చెట్టు కొమ్మ ఉయ్యాల్లోని పాప తల బయటికి పెట్టి విలుకాడి చేతులమీంచి లక్ష్యం వైపు చూస్తోంది. నిశ్శబ్దాన్ని నిండు కుండలో మోస్తున్నట్టు.... అడవి. విలుకాడి చేతిలోంచి శిలకోల దూసుకు పోయింది. లక్ష్యం ఎగిరి పోయింది. శిలకోల 'జువ్వవ్' మని శబ్దం చేస్తూ మాని మొజ్జు