
GURU NANAK JEEVITHAM SIDDANTHAM
₹30
In stock · 4 available
PublisherPROF.S.JAYAPRAKASH
LanguageTelugu
గురు నానక్ జీవితము - సిద్ధాంతము 'గురువుగా, మానవాళి ఆశాజ్యోతి'గా జగత్ప్రసిద్ధి చెందిన నానక్ 1469 వ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖున తాల్వండిబోయె అనే చిన్న గ్రామంలో జన్మించారు. పశ్చిమ పంజాబ్లో షేక్పురా జిల్లాలో అధిక భాగానికి, లాహోర్ జిల్లాలో నైరుతి భాగానికి చెందినదై బార్ అని పిలవబడే ఒండుమట్టి మైదానంలో ప్రస్తుతం తాల్వండి గ్రామం ఉంది. లాహోర్ నగరం నుండి నైరుతి దిశగా సుమారు 50 కి.మీ. దూరంలో ఈ గ్రామం ఉంది. మహారాజా కౌరామాల్ 1750 లో ఈ గ్రామంలో పుణ్య తటాకాలను ఏర్పరచి, స్మారక గురుద్వారాలను నిర్మించి, 'నాన్కానా సాహిబ్' అనే మారుపేరు పెట్టారు.¹ గురు నానక్ పవిత్ర జ్ఞాపకంగా నిర్మించబడిన స్మారక చిహ్నాలకు, గురుద్వారాలకు మహారాజా కౌరామాల్ తన వీలునామా ద్వారా సువిశాల భూములను సంక్రమింపజేశారు. 1947 నాటి ఇండియా విభజన సమయంలో నాన్కానా సాహిబ్ పాకిస్తాన్కు అప్పగించే వరకు ఈ భూములు ఆ గ్రామంలో అన్ని గురుద్వారాలకు చెందినవిగానే ఉండేవి. నానక్ తండ్రి ఒక పట్వారి. రామ్బులారి అనే భూస్వామిచే గ్రామ కరణంగాను, పన్నులు వసూలు చేసే పర్యవేక్షకాధికారి గాను నియమించబడినవాడు.