GURU VIGNANA SARVASVAM by THOTAPALLI BALAKRISHNA SARMA Telugu book cover

GURU VIGNANA SARVASVAM

by THOTAPALLI BALAKRISHNA SARMA

₹216
In stock · 3 available
PublisherTHOTAPALLI BALAKRISHNA SARMA
LanguageTelugu
శ్రీ గురుభ్యోన్నమః ముందుమాట శ్లో॥ గణపతి గురుమేకం, సచ్చిదానంద రూపం, విభుధ నివహ సేవ్యం, యోగ మార్గాధి రూఢం | శరణ ముపగతానాం, ఆర్తి సంఘాద్రి వజ్రం, మమ హృదయ నివాసం, భక్తి నమ్రో నమామి || "శ్రీ గురువిజ్ఞాన సర్వస్వం" అను నీగ్రంథరచనను 'శ్రీగురు' పాదకమల రేణువులచే నామనోదర్పణమును పవిత్రమొనర్చుకొని 'ధర్మార్థ కామ మోక్ష' ఫల ప్రదాయిని యగు సకల దేవాత్మక శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ శ్రీ గురు అవధూత దత్త పీఠాధిపతి శ్రీగురుదేవునకు నమస్కరిస్తూ గుర్వనుగ్రహంతో, గురువాశీర్వాద బలంతో రచనకు పూనుకొంటిని. ముందుగా కీ॥శే॥ నామాతా పితరులకు, అటులే నాకు మాతాపితృ తుల్యులగు మరియు గురుతుల్యులగు లకు॥సౌ॥ వెంకమ్మ, బ్రహ్మశ్రీ తోటపల్లి వేంకటేశ్వర శర్మ గారలు వదిన, అన్నగార్లకు పాదాభివందనములు. 'గురు' శబ్దానికి సంప్రదానంలో చతుర్థీవిభక్తి బహువచనం “గురుభ్యః” అంటే గురువులకు, “నమః" అంటే నమస్కారము. "శ్రీ" సకల ఆధ్యాత్మిక సంపదలకు నిలయమైన గురు పరంపరకు నా నమస్కారం. "గురువు" పరంపర అనగా, శ్రీశంకరాచార్యుల వంటి గురువునకు పద్మపాదుడు శిష్యుడు. ఇక గోవింద పాదులు పరమగురువు. గౌడపాదుల గురువు "పరమేష్ఠి" గురువుగా, లేదా గురువులందరికీ గురువైన పరమాత్మ పరమేష్టి గురువుగానెంచబడును. 'గురువు' అనేదే "పరమేష్టి” గురుపరంపర కదా! అట్టి గురువరేణ్యులకు శిష్యునిగా నమస్కరిస్తున్నాను. శిష్యుడికి గురువు పూజ్యుడు. శిష్యుని అణకువను, శ్రద్ధను గురుపాదపూజ, గురుపాదాభివందనం, ఆపాదధూళి స్వీకరించడంను సూచిస్తుంది. గౌరవమన్ననలకు గురువు అర్హుడు. అందుకు శిష్యునకు గురువు భగవద్స్వరూపుడుగా ఆధ్యాత్మవిద్యను అనుగ్రహిస్తాడు.