GURUDAKSHINA by N.V.R.SATYANARAYANAMURTHY Telugu book cover

GURUDAKSHINA

by N.V.R.SATYANARAYANAMURTHY

₹45
In stock · 540 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
పనికిరాని విద్యలు గురుకులంలో చదువు పూర్తిచేసుకున్న కమలాపురం యువకులు చంద్రుడు, రవి, రాము ఎవరికివారు విడివిడిగా దేశాటనం చేసి రావాలని నిశ్చయించుకొని, ఒక సంవత్సరం తరువాత విజయదశమినాడు రామాలయ మంటపంలో కలవాలని అనుకున్నారు. సంవత్సరం గడిచింది. అనుకున్నట్లుగా విజయదశమి నాటికి రామాలయ మంటపంలో ముగ్గురూ కలిసారు. చంద్రుడు "నేను ఒక విద్యనేర్చుకున్నాను- చూడండి!" అని రెండు నిమ్మకాయలు దూర దూరంగా నేలమీద పెట్టి “కదలండి!" అని ఆజ్ఞాపించినట్లుగా అన్నాడు. ఆశ్చర్యం కలిగించేటట్లుగా ఆ నిమ్మకాయలు కదలి ముందుకు వచ్చి గుద్దుకున్నాయి. "నేను ఒక ఊరిలో పదిరోజులు వుండవలపి వచ్చింది. అప్పుడు ఒక గారడీవాడు ఈ విద్యనేర్పాడు!" అన్నాడు చంద్రుడు.