GUTIKI CHERINA PATA by NAGARAJU RAMASWAMY Telugu book cover

GUTIKI CHERINA PATA

by NAGARAJU RAMASWAMY

₹120
In stock · 42 available
PublisherNAGARAJU RAMASWAMY
LanguageTelugu
నా రేపవళ్లు ఈ ఉదయం లేత కిరణాలను మోసుకొస్తున్నది లలిత పవనం ఉదయ రాగాలను మీటుతున సుతి మెత్తని వేకువ రేకులను సుతారంగా విప్పుతున్నది దిశాంతం నేను పసిడి తూరుపునై ప్రతిఫలిస్తాను! నా స్నేహ హస్త మిసిమి స్పర్శ దిగ్రేఖై దిగంతాలను అలుముకుంటున్నది. నా ఆలింగనంలో భూగోళం! ఈ సాయంసంధ్య ముదురు కెంజాయలను ముద్రిస్తున్నది కిరణం సమయ సంగీతం వినిపిస్తున్నది మేఘ శకలం నింగిలో బారులు దీరిన కొంగల రెక్కలకు బంగరు రంగుల నలదుతున్నది సాయంత్రం నేను పశ్చిమాకాశాన్నై పరవశిస్తాను! నా వాత్సల్య బాహువుల భద్ర భావం అలౌకిక అనుబంధ కరచాలనమై భూనభోంతరాలను అనుసంధిస్తున్నది. నా కౌగిలిలో బ్రహ్మాండం! నా ఉభయ సంధ్యలు, నా రేపవళ్లు నా ఎదకు లలిత నాట్యాలు నేర్పుతుంటవి నేను అలౌకిక ఆనంద కెరటాలమీద అనంత లాస్యం చేస్తుంటాను!