
HAI HAI AMERICA
by VISWANATHA RAMARAO, HARI RAJESWARI
₹60
In stock · 2 available
PublisherVISWANATHA RAMARAO, HARI RAJESWARI
LanguageTelugu
1. ప్రయాణపు పునాది మాకు ఇద్దరు అబ్బాయిలు. U.S. లో కుటుంబాలతో వుండి ఉద్యోగాలు కుంటున్నారు. మా పెద్దబ్బాయి శ్రీనివాస్ New Jersey (న్యూజెర్సీ) State లో, చిన్న అబ్బాయి త్ Georgia (జార్జియా) State లోనూ ఉంటారు. మాది విశాఖపట్నం. మా ఏకైక పుత్రిక విశాఖపట్నంలోనే వుంటుంది. అమెరికా నుండి సాధారణంగా రాత్రి 10 గంటలకు ఫోన్కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ల రాత్రి మన పగలు, మన పగలు వాళ్ల రాత్రి, నిత్య జీవితాలలో కూడా వాళ్లకూ మనకూ వైవిధ్యం ఉంది. రోజూలాగా, ఆ రోజూ 10 కి ఫోన్ వచ్చింది. మా ఆవిడ 71 అది మా అబ్బాయి వద్ద నుండే. మా ఆవిడ ముఖము ఆనందంతో హద్దులు వాటి వికసించింది. మా అబ్బాయి ఎప్పటి నుండో అమెరికాకు రమ్మని ఆహ్వానిస్తు న్నాడు. మా ఆవిడకు అమెరికా ప్రయాణం ఇష్టము. నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. మా ఇద్దరికి చాలా విషయాలలో ఏకాభిప్రాయం లేదు. మా అబ్బాయి చెప్పిన అమెరికా 79 వెంతలు వింటూ ప్రయాణం ఎప్పుడో చెప్పుకుపోతోంది మా ఆవిడ. ఇక ఆ పూట వారు పచ్చడి మెతుకులే గతి అయినాయి. నా అనుమతితో, ఆమెకు ఎప్పుడూ పని లేదు. ఏదైనా నేను ఎదురు చెపితే కొంపలో తుపాను ఛాయలు కనబడతాయి. అమెరికా ప్రయాణ విషయం మా ఆవిడ పక్కింటి పర్వత వర్ధిని' చెవిలో చెప్పింది. నోరు ఇంటర్నెట్ తో సమానము. మా అమెరికా ప్రయాణ వార్త పట్టణమంతా దావానలంలాగా వ్యాపించింది. మా ఆవిడ పట్టిన ఉడుం పట్టుకు, ఎదురు చెప్పలేక ప్రయాణానికి సరేనని 90 పకున్నాను. సన్నాహాలు మొదలు పెట్టాము. ప్రయాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గరించి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అమెరికా నుండి. అమెరికా ప్రయాణానికి విఘ్నేశ్వరుని పూజ కంటే ముందు, క్షవర కళ్యాణంతో శ్రీకారం చుట్టాను. ఎందుకంటే అక్కడ క్షవరానికి అయ్యే ఖర్చు మన బియ్యపు బస్తా 97 డతో సమానం. అమెరికా వెళ్లే ప్రతి ప్రయాణికుడూ ఈ నియమం పాటించవలసిందే. వంటి సూక్ష్మ రహస్యాలు మా అబ్బాయిలు ముందే తెలియజేసారు. ప్రయాణ వవాహాల్ని మా ఆవిడకు వదలబట్టే నా మనస్సు "ప్రశాంత నిలయము" అయింది. ప్రయాణపు పునాది