HANTAKA TRAYAM by DASARI SUBRAMANYAM Telugu book cover

HANTAKA TRAYAM

by DASARI SUBRAMANYAM

₹180
In stock · 11 available
PublisherNAVODAYA BOOK HOUSE
LanguageTelugu
చిన్నా పెద్ద చిట్టడవుల మధ్య ఒంటెత్తుగా వున్న ముచ్చుమర్రి గ్రామానికి అల్లంత దూరంలో వున్న సముద్రపు ఒడ్డున సరుగుడు చెట్ల చీకట్లలో వున్న చవటపల్లి రాజావారి రెండంతస్తుల భవంతినీ - ఎవడో దేశంకాని దేశస్థుడు కొనేశాడని విన్నప్పుడు బోయ ఓబన్నతోపాటు, గుండు రామన్నా, తిప్పన్నా, గంగడూ గడ్డాలను సవిరించుకొని, జల్లి మీసాలను మెలివేసుకున్నారు. అంతా బవిరి "ఆసేశా! నే సెపుతుండ గురుంచికో రావుఁడూ! ఆ పాడు కొంపలో రాత్తిళ్ళు దెయ్యాలూ, బూతాలూ కుస్తీపట్లు పడతవంటే నమ్ము. మొన్నగామొన్న పొద్దూకుతుండగా ఆ సరుగుడు చెట్టల్లోంచి వత్తావుంటే....” "ఆపోస్! ఆ పాటెవడికి తెలవదోస్!" అన్నారు గండురామన్నా. తిప్పన్నా -ఓబన్న మాటలకు అడ్డుపడుతూ. "ఇనండోస్, చంగతదికాదు...." అంటూ ఓబన్న ప్రారంభించేసరికి, గండురామన్న తుపుక్కుమని అంత దూరంగా వూసి, “ఓరి యదవనాయాలా, పెద్ద సెప్పొత్తుండావ్! ఆ దెయ్యాల యవారం నీకేం తెల్చురా?" అంటూ తిప్పన్న కేసి కన్ను గీటాడు. తిప్పన్న బొడ్డులోంచి యింత పుగాకుతీసి, పక్కనే వున్న జిల్లేడు మొక్క నుంచి హంతకత్రయం : మొసలి కన్నీరు : దెయ్యం చేతి కత్తి : చేజిక్కిన శత్రువు