HANUMA TATVAM YUVATHAKU ADARSAM by LAKKARAJU PURNACHANDRA RAO Telugu book cover

HANUMA TATVAM YUVATHAKU ADARSAM

by LAKKARAJU PURNACHANDRA RAO

₹99
In stock · 1 available
PublisherLAKKARAJU PURNACHANDRA RAO
LanguageTelugu
మనవి శ్రీ ఆంజనేయుడు అనగానే అందరికీ చాలా సంతోషంగా వుంటుంది. మనము రామాయణ కథలు అనేక రూపాల్లో చూస్తూ వుంటాము. వింటూ వుంటాం. ఆంజనేయుడు ప్రవేశించగానే పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా వుత్సాహంగా గమనిస్తూ వుంటారు. తరువాత ఏమిటో, ఏం జరుగుతుందోనని అత్యంత ఆతృతతో చూస్తూ వుంటారు. అట్టి ఆంజనేయుని సమగ్ర స్వరూపం శ్రీ వాల్మీకి రామాయణంలో ప్రస్ఫుటమౌతుంది. శ్రీవాల్మీకి మహిర్షి రచించిన రామాయణమే ప్రమాణ గ్రంథము. కిష్కింధకాండలో ప్రవేశించిన హనుమ యుద్ధకాండ వరకు ఆసాంతం ఒక ప్రధాన పాత్ర శ్రీరాముని తర్వాత. ఇందులో శ్రీరాముని పాత్ర గొప్పదా? హనుమ పాత్ర గొప్పదా? అంటే సమాధానం దొరకదు. అసలు హనుమ లేనిదే రాముడు లేడు, శ్రీరాముడు లేనిదే హనుమ లేడు. తరువాత సుందరకాండ. ఇందులో నాయకుడు హనుమంతుడే! రామాయణంలో సుందరకాండ, మహాభారతంలో భగవద్గీత, మణి ద్వీపాల్లాంటివి. ఈ రెండు గ్రంథములు భారతీయులకు అతిపవిత్రమైనవే. ఇవి ఒకసారి చదివినంత మాత్రాన అర్థం కావు. ఏదో సినిమా కథలాగా, కవి వర్ణనలతో బాగానే కనిపిస్తుంది. అనేకసార్లు చదువుతూ మననం చేసుకుంటుంటేగాని అందులో అంతర్లీనంగా ఉన్న భావార్థాలు, ఆథ్యాత్మికత, భగవానుని అవతార విశేషములు అంతుబట్టవు. ఎందరో మహాభక్తులు, మహాపండితులు రామాయణ గాథను రచించారు. వాల్మీకి మహర్షి నుండి నేటి విశ్వనాథ సత్యనారాయణ గారి వరకు అనేక మంది మహాకవులు ఈ రామాయణాన్ని రచించారు. పద్యాలరూపంలో, ద్విపద కావ్యంగా, పాటల రూపంలో, వచన రూపంలో, రకరకాలుగా, ఎవరి భక్తికి తగ్గట్టుగా వారు రచనలు చేశారు. ఎంతో తపస్వులయితే గాని కవులు గాలేరు గదా! అందుకే వారు వ్రాసిన కావ్యములన్ని ప్రసిద్ధ గ్రంథములయి, పూజనీయములయినవి. ఏ దేవతనైనా మంత్రోపాసన చేయదలచినప్పుడు ఆ దేవత యొక్క తత్త్వము తెలుసుకొనవలెను. అప్పుడే ఆ దేవత యొక్క సంపూర్ణ అనుగ్రహ పాత్రులవుతారు. హనుమతత్వాన్ని గురించి మనము ఎందుకు తెలుసుకోవాలి? అంటే ప్రస్తుత భారతీయులకు ఈ తత్త్వం చాలా అవసరమైనది. ఈ అవినీతి భారతంలో ఆంజనేయతత్వం తెలుసుకుని ఆచరించగలిగితే మనదేశం ప్రపంచ దేశాల్లో అత్యుత్తమ దేశంగా పేరు పొందుతుంది. ప్రస్తుతం మన భారతీయ సమాజం పెడదారులు తొక్కుతున్నది. పాశ్చాత్య సంస్కృతికి దాసోహమంటున్నది.