HANUMADWIBHUTHI by T.H.NATARAJA RAO Telugu book cover

HANUMADWIBHUTHI

by T.H.NATARAJA RAO

₹250
In stock · 6 available
PublisherT.H.NATARAJA RAO
LanguageTelugu
ఆత్మ నివేదన త్రికూట పర్వత ప్రాంతంలో ఒంటరిగా అసహాయశూరుడై ఆంజనేయస్వామి సూర్యాస్తమయం వరకు వేచి యున్న దృశ్యం చాలా కాలంగా నా మనస్సును ప్రచోదితం చేస్తూ వుండేది. క్రూరాతిక్రూరులు బలిష్ఠులైన రాక్షసులచే రక్షింపబడుచున్న లంకానగరంలో లక్ష్యాలక్ష్య రూపం కాని సూక్ష్మ రూపమే సీతాన్వేషణకు అనుకూలమైనదని ఆ లంకాపురి ప్రవేశమునకు రాత్రియే అనుకూలమయిన సమయమని హనుమ నిశ్చయించుకుంటాడు. అందుకోసం సూర్యాస్తమయం కొరకు ఎదురుచూస్తూ వుండాల్సిన అగత్యమేర్పడుతుంది. “సూర్వేచాస్తంగతే రాత్రే దేహం సంక్షిప్యమారుతి: వృషదంశక మాత్రస్సన్ బభూవాద్భుతదర్శనం:” అని కేవలం ఒకే ఒక శ్లోకంతో హనుమ నిరీక్షణను ముగిస్తూ వాల్మీకి మహర్షి కథను ముందుకు సాగిస్తాడు. త్రికూటం చెంత హనుమంతుడు ఆ విధంగా ఎంతసేపు ఎదురుచూస్తూ వున్నాడు, చీకటి పడే వేళ వరకు సమయాన్ని ఎలాగడిపాడు అన్న వివరాల జోలికి మహర్షి వెళ్లలేదు. ఆ అనుపమ విక్రాంతిశీలి హనుమ అంతసేపు ఎలా ఏపనీ లేకుండా వున్నాడు? ధ్యాన సమాధిలో స్వామి ఏ చెట్టు క్రిందనో నిశ్శబ్దంగా కూచుని సూర్యాస్తమయం వరకు త్రికూటంలో కాలం గడిపివుంటాడు అన్నది ఎవరికైనా తోచే సమాధానం. శతయోజనాల విస్తీర్ణాన్ని గగనతలంలో అవలీలగా దాటి సముద్ర లంఘనం సుసంపన్నం గావించిన పరాక్రమశాలి, హనుమద్విభూతి