
HAPPY LIFEKI SOPANALU
₹15
In stock · 32 available
PublisherSRI SAHITYA PUBLICATIONS
LanguageTelugu
హ్యాపీ లైఫ్కి సోపానాలు బాలలూ! మనం సమాజంలో వున్నాం. మనం వేరు, సమాజం వేరు కాదు. మనం లేనిదే సమాజం లేదు. అలాగే సమాజం లేనిదే మనకూ మనుగడ లేదు. మనం సమాజంలో వుంటూ మాజానికి మంచి పేరు వచ్చేలా మనం మన ప్రవర్తనను రూపొందించుకోవాలి. తద్వారా మనకూ, మనం రూపొందించుకున్న సమాజానికీ మంచిపేరు వస్తుంది. మనం సత్ప్రవర్తనతో మెలగటం మన విధి. ఇంకోవిధంగా చెప్పాలంటే సత్ప్రవర్తన మన ఊపిరి కావాలి. మన జీవనలక్ష్యం కావాలి. లక్ష్యం మంచిదైతే ఫలితమూ బాగుంటుంది. అందుకే అంటారు పెద్దలు... "వచస్యేకం మనస్యేకం కర్మణ్యేం మహాత్మనః" అని మన పెద్దలంటారు. మనం ఏది ఆలోచిస్తామో దానినే చెప్పాలి. ఏది చెప్తామో దానినే చేయాలి. అప్పుడే సత్ఫలితాలు పొందగలం. సమాజం అంటే ఏమిటో మరెక్కడనో లేదు. "నువ్వు నేను కలిస్తే మనం... మనం మనం కలిస్తే జనం... జనం జనం కలిస్తే సమాజం... సమాజం సమాజం కలిస్తే సహృద్ధ్భావమే..." సమాజంలో మనం మంచి పౌరులుగా మెలగాలంటే ఈ చిన్నిపొన్ని సూత్రాల్ని పాటిస్తే చాలు. మీరు భావిభారత నిర్మాతలుగా రూపొంది చక్కటి పౌరులుగా రూపు దిద్దుకుంటారు. మరి వీటిని చదివి ఆచరణలో పెడదామా మరి...! వాటిలో కొన్నింటిని మనం ఇప్పుడు చదువుదాం చూద్దాం. వీటిని ఆచరించేందుకు కొద్దిపాటి నిగ్రహం వుంటే చాలు, వీటిని సులభంగా ఆచరించగలం. ఇంక ఆలస్యం దేనికి ? చూద్దాం ఆచరిద్దాం...