HARI KOLUVU by JULAKANTI BALASUBRAHMANYAM Telugu book cover

HARI KOLUVU

by JULAKANTI BALASUBRAHMANYAM

₹75
In stock · 16 available
PublisherJULAKANTI BALASUBRAHMANYAM
LanguageTelugu
ముందుమాట "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, సంకన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” 'బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీ వేంకటేశ్వరునకు సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో లేదు, అటు భవిష్యత్తులోనూ ఉండబోడు' అన్న ప్రశస్తికి అనేక కారణాలు గోచరిస్తాయి. డిండ్ అందులో మొదటిది శ్రీనివాసుడు నెలకొనివున్న దివ్యస్థలం. వేదములే శిలలై వెలసిన దీ కొండ యే దెస బుణ్యరాసులే యేరులైన దీ కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవు దుండేటి శేషాద్రి యీ కొండ అంటూ ఈ క్షేత్రంయొక్క నిజమైన ఆధ్యాత్మిక తేజో వైభవాన్ని అన్నమాచార్యులు ఆవిష్కరించాడు. ఇక ఆ స్వామి పేరుకూడా ఒక అద్భుతమే! తిరుమలేశుడు తాను నిలిచివున్న దివ్యస్థలాన్ని బట్టీ, తన వక్షఃస్థలంమీద వెలసిన శ్రీమహాలక్ష్మి పేరు ననుసరించీ పిలువబడుతూవున్న సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి. అంత మాత్రమే కాదు, ఆ శ్రీనివాసుడు నిలిచివున్న తీరుకూడ ఆశ్చర్యకరమే! “సంసార సాగర సముత్తరణైక సేతో' అన్నట్లుగా కటి వరదహస్తాలతో ఒక సాంపైన భంగిమలో నిలిచివుంటూ అందరినీ అనుగ్రహించి అలరిస్తూవున్న ఆ స్వామి ఆనందనిలయుడు. అలాగే, తిరుమలప్పనికి అలంకరింపబడే అనేక దివ్యాభరణాలూ, వివిధ రకాలైన నవరత్న మణిహారాలు చూపరులను ఆశ్చర్య పరవశులను గావిస్తూ వేంకటరమణుని అనంతవైభవాన్ని వేనోళ్ల చాటుతూ వున్నాయి.