HARIKATHA BIKSHUVU - JEEVANA DARSHANAM by M.S.SURYA NARAYANA Telugu book cover

HARIKATHA BIKSHUVU - JEEVANA DARSHANAM

by M.S.SURYA NARAYANA

₹200
In stock · 6 available
PublisherM.S.SURYA NARAYANA
LanguageTelugu
ముందుమాట "హరికథా భిక్షువు" ఈ పుస్తకానికి ముందుమాట నువ్వు రాస్తే బావుంటుందని మణి అంటే యధాలాపంగా 'అలాగే' అన్నాను. తీరా పది పేజీలు చదవింతర్వాత, అమ్మో ఇదేదో మహాకావ్యం అనిపించింది. ముందుగా శ్రీ ఎమ్మెస్. సూర్యనారాయణ... ఆ రచయితకి నా నమస్కారములు. అంత అద్భుతమైన రచన. భాషా పరిజ్ఞానంలో గాని, భావ చతురతలో గాని, వివరణచేసే నైపుణ్యంలో గాని అనన్య సామాన్యంగా ఉంది. ఇలాంటి గ్రంథానికి మహామహులు ఏ మాడుగులవారో, సామవేదంవారో, చాగంటివారో రాయాలిగాని, నూటికి నూరుపాళ్ళు నాబోటి మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు! ఇది సత్యం! ఈ పుస్తకం (గ్రంథం) చదవకముందు మా బాబాయి అంటే ఒక ఆరడుగుల మంచిగంధంతో చేసిన గణపతి అనుకున్నా గాని ఇలా ఖైరతాబాద్ వినాయకుడు అనుకోలేదు. ఆ సత్యం ముందే తెలిసుంటే, ఆయన సుశ్రూష చేసి, కొన్ని సాహిత్యపు మెళుకువులు నేర్చుకుని, ఇంకో పది 'శంకరాభరణాలు' తీసి ఉండేవాడిని. మళ్ళీ మళ్ళీ చెబుతున్నా! ఈ గ్రంథంలో అట్టకు అట్టకు మధ్య ఉన్నవి మామూలు పేజీలు కావు. అన్నమాచార్యులవారి రాగిరేకులలో ఉన్నంత సాహిత్య పెన్నిధి ఉంది. మణీ! ఆనాడు నెల్లూరులో విగ్రహప్రతిష్ఠ చేసి, ఈనాడు ఇలాంటి కావ్యం రాయించి పితృరుణం తీర్చుకున్నావు! ధన్యుడివి! నాచేత ఇలా రెండు మాటలు రాయించి బాబాయి తొడుక్కునే లాల్చీలో రెండు గుండీల స్థలం ఇచ్చినందుకు నేనూ ధన్యుడనే! నిజంగా బాబాయి కారణజన్ముడు. కర్మయోగి !!