
HARITHA
by S.A.RAO
₹40
In stock · 1 available
PublisherS.A.RAO
LanguageTelugu
వెంకటేశ్వర్రావు విజయం-1 ఏదో సందర్భంలో ప్రముఖ రంగస్థల ప్రయోక్త, మిత్రుడు శ్రీ కె. వెంకటేశ్వరరావుకి నా మనసులో రూపుదిద్దుకున్న 'హరిత' కథ వినిపించాను. కొత్త పాయింటు, ఎవరూ వూహించలేని ట్విస్టు వున్నాయి కాబట్టి సినిమాకి అయితే బావుంటుందని అతను అన్నాడు. కొన్నాళ్ల తర్వాత ఓరోజు మా ఇంటికొచ్చి ఆ 'హరిత' కథ తనకి బాగా నచ్చిందని అదే కథని నాటికగా రాసిమ్మని కోరాడు. సినిమా కోసం Span చేసిన కథని ప్రొసీనియం థియేటర్ పరిధిలో నాటికగా రాయడం కష్టం అన్నాను. స్టేజి నాటికల్ని సినిమా కథలుగా మార్చడానికి వీలవుతున్నప్పుడు సినిమా కథని నాటికగా ఎందుకు రాయలేరు అని తర్కించాడు. "మీరు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మీ డైరీలో రాసిపెట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది? ముందు నాటికగా మలిచి రాయండి. నేను ప్రదర్శిస్తాను. సినిమా సంగతి తర్వాత ఆలోచిద్దాం” అని నాటికగా రాసే వరకు విక్రమార్కుడిలా వెంకటేశ్వరరావు తన పట్టు వదల్లేదు. నాటికగా రాసే ముందు అలవాటు ప్రకారం Plot Construction చేసుకుని వెంకటేశ్వరరావుకి వివరించాను. రంగస్థల దర్శకుడిగా అపారమైన అనుభవం గడించిన అతని సూచనలు కూడా విన్నాను. శ్రీకారం చుట్టిన వారం రోజులకి నాటిక పూర్తిచేసి ఇచ్చాను. మీ 'హరిత'కి పరిషత్తుల్లో ఉత్తమ ప్రదర్శనతోబాటు ఉత్తమ రచన బహుమతి కూడా వస్తుందని చదివిన వెంటనే జోస్యం చెప్పాడు వెంకటేశ్వరరావు. రిహార్సల్స్కి వ్యవధి లేకపోయినా రైల కళారంగ్, సికింద్రాబాద్ నిర్వహించిన నాటికల పరిషత్, తన జయకళానికేతన్ సంస్థ పేరున తొలి ప్రదర్శనగా ఎంట్రీ ఇచ్చేశాడు.