HARITHA BHARTHAM by PROF.ALDHAS JANAIAH Telugu book cover

HARITHA BHARTHAM

by PROF.ALDHAS JANAIAH

₹280
In stock · 88 available
PublisherPROF.ALDHAS JANAIAH
LanguageTelugu
'సాగు' దారేది? వాష్టంలో వ్యవసాయ పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ న ప్రత్యేకంగా మన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రత్యేకించి వ్యవసాయ సమీక్ష ఔ ప్రధానమంత్రి మన రాష్ట్రాన్ని సందర్శించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. చరిత్రలోకి వెళితే ఇలాంటి సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. జవాహరణకు 1950-60ల మద్యలో నెహ్రూ, 1970ల ఆరంభంలో ఇందిరాగాంధీ, చివరల్లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రులుగా వ్యవసాయ పరిస్థితిని సమక్షించడానికి ప్రత్యేకంగా మన రాష్ట్రానికి వచ్చారు. ప్రత్యేకంగా వ్యవసాయ రంగ పరిస్థితిపై చర్చించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన 2007 మే 29న జాతీయ అభివృద్ధి మండలి (ఎన్.డి.సి) సమావేశమైంది. పదకొండో ప్రణాళిక కాలంలో ఏటా కనీసం నాలుగు శాతం వ్యవసాయ వృద్ధి సాధించేందుకు ఉద్దేశించిన విస్తృత అజెండాతో 53వ ఉర్మానాన్ని అది ఆమోదించింది. ప్రత్యేక పథకాలు, కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడుల పెంపును ప్రోత్సహించేందుకు రాష్ట్రాలకు వచ్చే అయిదేళ్ల కాలంలో అదనంగా రూ.25,000 కోట్ల కేంద్ర సాయాన్ని అందజేస్తానని కూడా ప్రధానమంత్రి ఎన్.డి.సి. సమావేశంలో ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రస్తుత ప్రభుత్వం అదనపు సహాయాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు ప్రధానమంత్రి ప్యాకేజీ మంచి అవకాశం కల్పిస్తోంది. ప్రధానమంత్రి ప్రస్తుత పర్యటనను, ఎన్.డి.సి. సమావేశంలో 53వ తీర్మానం ఆమోదించడాన్ని బట్టి చూస్తే రైతుల పట్ల, వ్యవసాయ రంగంపట్ల ఆయనకు అమితశ్రద్ధాసక్తులు ఉన్నట్టు మరోమారు స్పష్టమవుతోంది. రైతుల సంక్షేమం పట్ల ఆయనకు ఆసక్తి, వ్యవసాయ రంగంపట్ల గల కట్టుబాటు రాష్ట్రానికి కేంద్రసహాయం రూపంలో ఎంతమేరకు ప్రతిఫలించగలవో చూడాలి. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004లో ప్రధానమంత్రిగా పదవిని అధిష్టించిన వెంటనే మన రాష్ట్రాన్ని సందర్శించారు. రైతుల సాదకబాధకాలను స్వయంగా చూసి తెలుసుకోవడానికి అప్పట్లో మన రాష్ట్రానికి వచ్చిన ఆయన అనేక సహాయ చర్యలూ ప్రకటించారు.