HARITHA HARAM by VAYYA SAMELU Telugu book cover

HARITHA HARAM

by VAYYA SAMELU

₹40
In stock · 96 available
PublisherTELANGANA ABHYUDAYA RACHAITHALA SANGAM
LanguageTelugu
" చవులూరించే సామేలు పాటలు హరిత హారం" వయ్యా సామేలు సహజ కవి. ఆయన సృజన భూమి చుట్టూ సూర్యుడిలా ప్రజల చుట్టూ పాలకుల వంచన చుట్టూ సాగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన రచించిన 18 గేయ సంపుటాలు ఆయనకు ఉన్న కవిత్వ శక్తినే చాటుతున్నాయి. బుర్రకథా గానంతో గేయ రచన మొదలైన ఆయన జీవన కవితా ప్రస్థానం బహుముఖీంగా లలిత గీతాలతో సాగుతూ వస్తున్నది. 1969 తెలంగాణ ఉద్యమంలో ఆయన, ఆయన సోదరుడు వయ్యా రాజారాం తమ కలం కదిలించి. గళం సవరించి ఉద్యమ కారులను చైతన్య పరిచారు. వయ్యా సామేలు ఆ రోజులలో, రాణిరుద్రమదేవి బుర్రకథా గానం చేస్తూ ఎందరో యువకళాకారులకు మార్గదర్శకుడైనాడు, బ్రహ్మానందరెడ్డి నీ బతుకే బంజరుదొడ్డి. నీ తోత్తులు మేసిర గడ్డి నువ్వు ఎక్కర బెజవాడ గాడి, అంటూ ఆంధ్రుల మీద ఆగ్రహంతో స్వాభిమానంతో గొంతెత్తి పాడారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా దాదాపు 50 సంవత్సరాలుగా తన కలాన్ని కదిలిస్తూ గళాన్ని వినిపిస్తూ తరగని అభినివేశంతో యువకులను చైతన్యపరుస్తూ వస్తున్నాడు. తన జీతాన్ని అభ్యుదయవాదానికి ధారపోసిన వయ్యా సామేలు ప్రజాగాయకులైన గద్దర్, వంగపండు ప్రసాద్, గూడ అంజయ్య కోవలోకే చేరిపోతాడు. సమకాలీన సమస్యల మీద స్పందించి "హరితహారము" చక్కటి గేయ సంపుటిని ప్రజల కోసం వెలువరిస్తున్నారు. ఆయన కవన కృషికి ముందుగా ఆయన్ని అభినందించాలి. చదువులతో పని ఏమీ హృదయమున్న చాలు, అనే మాటకు 'డిగ్రీలతో పనేమి కవనమున్న చాలు' అన్న రీతిలో మన ముందు నిలుస్తాడు కవి వయ్యాసామేలు. "అమ్మా నేను బడికి పోతా" అంటూ చెప్పిన ఈ ఒక్క బుర్రకథను పరిశీలిస్తే ఆయనలోని చదుకొని తనాన్ని, ఆవేదనను తెలుసుకోగలం. ఆ రోజులలో బ్రతుకుదెరువు కోసం గొడ్లను కాయడం, దొరలకు కట్టు బానిసగా పడి ఉండడం, దాంతో అంతంత మాత్రమే బ్రతుకడమే ఆయనకు గగనమైంది. కాని బర్లను కాచినా. గొర్లను కాచినా ఆయనలో ఉన్న జిజ్ఞాస గాన కళా వైపుగా మళ్లించింది. దానికి సాయుధపోరాట పాటలు తెలంగాణ ఉద్యమ గీతాలు ఎంతగానో దోహదం చేశాయి. ఆ అనుభవసారమే ఆయన రచించిన 18 గేయ సంపుటాలు. 18 పర్వాల గేయాలు తెలుగుజాతి భారత కావ్య సంపుటాలు. గేయరచనల్లో ఆరితేరిన కవుల్లా ఆయన గీతాలు రూపొందాయి. 'గాతుం యోగ్యం గానం' అనే నానుడి సామేలు లాంటి వాగ్గేయకారుడికి సరిగ్గా సరిపోతుంది. గ్రహించిన సమస్యను కవితా వస్తువుగా చేసినప్పుడు గేయాల్లో ప్రస్తానంలా పల్లవిలోకి